ఏఐ కోర్సు పూర్తి చేసి ఇండియాకి తిరుగు ప్రయాణం !

లోకనాయకుడు కమల్ హాసన్ గతేడాది సెప్టెంబర్‌లో అమెరికా వెళ్లి.. అక్కడ ఏఐ పై కోర్సు పూర్తిచేశారు. ఇప్పుడు.. ఆ కోర్సును విజయవంతంగా పూర్తి చేసుకొని తాజాగా ఇండియాకి తిరిగి వచ్చారు. కమల్ హాసన్ ఇండియా వచ్చిన వెంటనే మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా.. తన తదుపరి సినిమా గురించి కొంత సమాచారం ఇచ్చారు. కథ రాయడం కూడా పూర్తిచేసినట్లు తెలిపారు.
విమానాశ్రయంలో మాట్లాడిన కమల్ హాసన్.. తన ఇతర ప్రాజెక్టుల గురించి కూడా ప్రస్తావించారు. ముఖ్యంగా.. మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘థగ్ లైఫ్’ సినిమా 2025 జూన్ 5న విడుదల కానుందని తెలిపారు. తాజా సమాచారం ప్రకారం.. కమల్ హాసన్ అమెరికా వెళ్లింది కేవలం కోర్సు చేయడానికే కాకుండా, ఏఐ వినియోగాన్ని పరిశీలించడానికి కూడా. ఇప్పటివరకు ఆయన తన సినిమాల్లో ఎన్నో సాంకేతిక ప్రయోగాలు చేశారు. ఇప్పుడు.. ఏఐ సాంకేతికతను కూడా తన భవిష్యత్ చిత్రాల్లో వినియోగించనున్నట్లు సమాచారం.
యాక్షన్ కొరియోగ్రఫీ ద్వయం .. అన్బరివు దర్శకత్వంలో కమల్ హాసన్ ఓ సినిమా చేస్తున్నప్పటికీ.. ఆయన మరో భారీ ప్రాజెక్ట్‌లో కూడా భాగస్వామిగా ఉన్నారు. మణిరత్నం దర్శకత్వంలో రూపొందుతున్న ‘థగ్ లైఫ్ ’ నటించడమే కాకుండా.. కమల్ హాసన్ కథా రచయితగా కూడా వ్యవహరిస్తున్నారు. ఇందులో, ప్రముఖ నటుడు సింబు కీలక పాత్ర పోషించనున్నాడు. అలాగే త్రిషా కృష్ణన్, అశోక్ సెల్వన్, ఐశ్వర్య లక్ష్మి, జోజు జార్జ్, అభిరామి, నాజర్, అలీ ఫజల్ తదితరులు ఇతర ముఖ్యమైన పాత్రల్లో నటిస్తున్నారు.
-
Home
-
Menu