కార్తికి జోడీగా కళ్యాణి ప్రియదర్శన్?

కార్తికి జోడీగా కళ్యాణి ప్రియదర్శన్?
X
ప్రముఖ నిర్మాణ సంస్థ డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్‌పై రూపొందనున్న ఈ చిత్రానికి దర్శకుడు తమిళ. త్వరలో షూటింగ్ ప్రారంభం కావాల్సిన ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించి చిత్రబృందం ప్రస్తుతం ప్రధాన తారాగణ ఎంపికపై దృష్టి సారిస్తోంది.

తమిళ స్టార్ హీరో కార్తి తన 29వ సినిమాను అధికారికంగా ఖరారు చేశాడు. ప్రముఖ నిర్మాణ సంస్థ డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్‌పై రూపొందనున్న ఈ చిత్రానికి దర్శకుడు తమిళ. త్వరలో షూటింగ్ ప్రారంభం కావాల్సిన ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించి చిత్రబృందం ప్రస్తుతం ప్రధాన తారాగణ ఎంపికపై దృష్టి సారిస్తోంది. సినిమాలో కార్తి సరసన కథానాయికగా కల్యాణి ప్రియదర్శన్‌ను ఎంపిక చేసినట్లు సమాచారం.

ఇప్పటికే ఆమెతో చిత్రబృందం చర్చలు పూర్తి చేసుకున్నట్టు తెలుస్తోంది. అలాగే, ప్రముఖ నటుడు వడివేలు ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో నటించనున్నారు. ఈ చిత్రం సముద్ర నేపథ్యంతో కూడిన పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కనుంది. గతంలో రామేశ్వరం, శ్రీలంక మధ్య విస్తరించి ఉన్న సముద్ర దొంగల చుట్టూ తిరిగే నిజ సంఘటనల ఆధారంగా ఈ కథ అల్లినట్టు సమాచారం. ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ దశలో ఉన్న ఈ సినిమా మే లేదా జూన్ నెలల్లో సెట్స్‌పైకి వెళ్లనుంది.

ఇక ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా తెరకెక్కించే ఆలోచన జరుగుతున్నట్లు టాలీవుడ్ వర్గాల్లో చర్చ నడుస్తోంది. మరోవైపు, ప్రస్తుతం కార్తి నటించిన ‘వా వాద్యారే’ విడుదలకు సిద్ధమవుతుండగా.. ‘సర్దార్ 2’ చిత్రీకరణ ముగింపు దశలో ఉంది.

Tags

Next Story