సూర్య ‘రెట్రో’ పై భారీ అంచనాలు!

తమిళ స్టార్ హీరో సూర్య ఇటీవల మరీ ఆసక్తికరంగా లేకుండా పోయిన చిత్రాల్లో నటించడంతో.. అతని సినిమాలు బాక్సాఫీస్ వద్ద పెద్దగా ఆకట్టుకోలేకపోయాయి. అయితే, తన అనుభవాన్ని, నైపుణ్యాన్ని పూర్తిగా ఉపయోగించి, ఈసారి మంచి సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. సూర్య నటించిన తాజా చిత్రం ‘రెట్రో’ టీజర్ ఇటీవల విడుదలయ్యింది. విడుదలైన వెంటనే అన్ని వర్గాల ప్రేక్షకుల నుండి అనూహ్య స్పందనను సొంతం చేసుకుంది.
ఈ నేపథ్యంలో, ఈ చిత్ర దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ తాజాగా ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. ఆయన చెప్పిన మేరకు, ఫైనల్ కాపీ పూర్తిగా సిద్ధం కాగా, సినిమా యూనిట్ మొత్తం ఫలితంపై చాలా సంతోషంగా ఉంది. అంతేకాకుండా, సూర్య కూడా ఇప్పటికే ఫైనల్ కాపీ వీక్షించాడని, సినిమా తాను ఊహించిన దానికంటే ఎంతో మెరుగ్గా వచ్చిందని పేర్కొన్నాడు. ఈ యాక్షన్ థ్రిల్లర్ వింటేజ్ బ్యాక్‌డ్రాప్‌లో సాగుతుండటంతో, ఇది ప్రేక్షకులకు కొత్త అనుభూతిని కలిగించనుందని దర్శకుడు తెలియజేశారు.
చిత్రీకరణ పూర్తయిందని, ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయి అని కార్తీక్ తెలిపారు. వీటిని త్వరగా పూర్తి చేసి, ప్రమోషన్‌ను ప్రారంభించనున్నట్లు పేర్కొన్నారు. ఇప్పటికే డబ్బింగ్ పూర్తి కాగా, సూర్య ఫైనల్ డబ్బింగ్ వెర్షన్ చూడగానే ఎంతో సంతృప్తి వ్యక్తం చేశాడు. ఈ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకుని సూర్య కెరీర్‌లో మరో మైలురాయిగా నిలుస్తుందని దర్శకుడు ధీమాగా చెబుతున్నారు. ఈ యాక్షన్ పీరియడ్ డ్రామా ‘రెట్రో’ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. మరి ఈ చిత్రం సూర్యకు విజయాన్ని అందించగలదేమో చూడాలి!
-
Home
-
Menu