సూర్య - వెట్రిమారన్ కాంబో పై అప్డేట్ ఇదిగో !

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య ప్రస్తుతం ఒక మాంచి హిట్ కోసం ఎదురుచూస్తున్నా, ఆయన చేయబోయే చిత్రాలపై తమిళ ప్రేక్షకుల్లో భారీ ఆసక్తి ఉంది. ముఖ్యంగా, దర్శకుడు వెట్రిమారన్ తెరకెక్కించనున్న ‘వాడివాసల్’ కోసం అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కొద్ది రోజుల క్రితం జరిగిన ఓ కార్యక్రమంలో ప్రేక్షకులు వెట్రిమారన్‌ను సూర్య సినిమా గురించిన అప్డేట్ గురించి అడగగా, ఆయన ‘వాడివాసల్’ షూటింగ్ 2025 మే లేదా జూన్‌లో ప్రారంభమవుతుంది. ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి’ అని వెల్లడించారు. ఈ మాటలతో ఆ వీడియో ఒక్కసారిగా వైరల్ అయ్యింది.
ఇక 2025 జనవరి 15న ‘మట్టు పొంగల్’ సందర్భంగా చిత్ర నిర్మాత కలైప్పులి ఎస్. థాను సూర్య, వెట్రిమారన్‌లతో కలిసి ఉన్న ఓ ఫొటోను షేర్ చేస్తూ.. ప్రీ-ప్రొడక్షన్ మొదలైందని అధికారికంగా ప్రకటించారు. గతంలో వచ్చిన రిపోర్ట్స్ ప్రకారం.. ఈ సినిమా మూడు భాగాలుగా రూపొందనుందనీ, వెట్రిమారన్ ప్రతిష్టాత్మకంగా.. గ్రాండ్ స్కేల్‌లో ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారని తెలుస్తోంది.
ఈ సినిమా తమిళనాడులో జరిగే జల్లికట్టు పండుగ నేపథ్యంలో సాగుతుంది. కథానాయకులు పిచ్చి, మరుదన్ అనే ఇద్దరు. వీళ్ళు ఒకప్పుడు పిచ్చి తండ్రిని ఓడించిన గేదెను సాధించేందుకు ప్రయత్నించే కథ ఇది. ఇక సూర్య విషయానికొస్తే.. ఆయన ఇప్పటికే కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో రూపొందిన ‘రెట్రో’ చిత్రీకరణను పూర్తి చేసేశాడు. ఈ చిత్రం మే 1న థియేటర్లలో విడుదల కానుంది. ఇందులో పూజా హెగ్డే కథానాయికగా నటించింది. అలాగే, తెలుగు దర్శకుడు వెంకీ అట్లూరితో కూడా సూర్య ఓ సినిమా చేయబోతున్నట్లు టాలీవుడ్ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి.
-
Home
-
Menu