ఇకనుంచి నేను లేడీ సూపర్ స్టార్ ను కాను : నయనతార

ఇకనుంచి నేను లేడీ సూపర్ స్టార్ ను కాను : నయనతార
X

సౌత్ ఇండియన్ టాప్ హీరోయిన్ నయనతార తన పేరుకు ముందు ముద్దుపేర్లను జోడించకూడదని ఇటీవల నిర్ణయం తీసుకుంది. మంగళవారం ఆమె దీనిపై ఒక ప్రకటన విడుదల చేసింది. తనను ‘లేడీ సూపర్ స్టార్’గా అభివర్ణిస్తున్న అభిమానులకు కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఇకపై కేవలం నయనతార అని మాత్రమే పిలవాలని కోరింది. ఈ నిర్ణయానికి కారణంగా, తన పేరే తనకు అత్యంత సమీపమని, అది తనను నటిగా మాత్రమే కాకుండా వ్యక్తిగా కూడా ప్రతిబింబిస్తుందని చెప్పింది.





అవార్డులు, బిరుదులు ఎంతో విలువైనవేనని చెప్పిన నయనతార, అయితే అవి మన పని, మన కళ, ప్రేక్షకులతో మనకున్న బంధాన్ని వేరు చేస్తాయని వివరించింది. ఇటీవల కమల్ హాసన్, అజిత్ కుమార్ వంటి నటులు కూడా తమ పేరుకు ముందు ముద్దుపేర్లు ఉపయోగించవద్దని అభ్యర్థించిన విషయం తెలిసిందే. నయనతార చివరగా ‘అన్నపూరణి: ది గాడెస్ ఆఫ్ ఫుడ్’ చిత్రంలో నటించింది. ఆమె జీవితం, కెరీర్‌పై రూపొందించిన డాక్యుమెంటరీ ‘నయనతార: బియాండ్ ది ఫేయిరీటేల్’ గత ఏడాది నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైంది.

ప్రస్తుతం ఆమె ‘టెస్ట్’ (తమిళం), ‘మన్నంగట్టి సిన్స్ 1960’ (తమిళం), ‘డియర్ స్టూడెంట్స్’ (మలయాళం), ‘యమ్.యమ్.యమ్.యన్’ (మలయాళం), ‘టాక్సిక్’ (కన్నడ, ఇంగ్లీష్), ‘రక్కయ్యి’ (తమిళం), ‘మూకుత్తి అమ్మన్ 2’ (తమిళం), అలాగే విశ్ణు ఎడవన్ దర్శకత్వంలో రూపొందుతున్న ఓ తమిళ చిత్రాల్లో నటిస్తోంది. వీటిలో కొన్ని చిత్రీకరణ దశలో ఉండగా, మరికొన్ని విడుదలకు సిద్ధంగా ఉన్నాయి.

Tags

Next Story