మద్రాస్ నేపథ్యంలో దుల్కర్ సల్మాన్ సినిమా !

మద్రాస్ నేపథ్యంలో దుల్కర్ సల్మాన్ సినిమా !
X
రీసెంట్ గా ‘లక్కీ భాస్కర్’ సినిమాతో మరో బ్లాక్‌బస్టర్ అందుకున్న దుల్కర్ సల్మాన్ ప్రస్తుతం ‘కాంత’ అనే తమిళ చిత్రంలో నటిస్తున్నాడు.

దక్షిణాది సినీ ప్రేమికులలో ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించిన మాలీవుడ్ స్టార్ దుల్కర్ సల్మాన్. టాలీవుడ్‌లోనూ విజయవంతంగా తన ప్రయాణాన్ని కొనసాగి స్తున్నాడు. రీసెంట్ గా ‘లక్కీ భాస్కర్’ సినిమాతో మరో బ్లాక్‌బస్టర్ అందుకున్న అతడు ప్రస్తుతం ‘కాంత’ అనే తమిళ చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్రాన్ని రానా దగ్గుబాటి, దుల్కర్ సల్మాన్ కలిసి నిర్మిస్తున్నారు. ఆసక్తికరమైన కథాంశంతో రూపుదిద్దుకుంటున్న ఈ సినిమాను పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేయనున్నారు.

‘కాంత’ కథ 1950 కాలం నాటి మద్రాస్ నేపథ్యంలో సాగుతుంది. ఆ కాలపు వాతావరణాన్ని సహజంగా తీర్చిదిద్దేందుకు చిత్రబృందం ప్రత్యేకమైన సెట్లను రూపొందించి.. ప్రతీ చిన్న డీటెయిల్ పైనా శ్రద్ధ పెట్టింది. ఈ సినిమాలో దుల్కర్ ఓ నిజ జీవిత వ్యక్తిగా కనిపించనున్నాడు. పాత్రకు పూర్తి న్యాయం చేయాలనే ఉద్దేశ్యంతో.. అతడే స్వయంగా ఆ వ్యక్తి కుటుంబ సభ్యులను కలుసుకుని.. వారి జీవితంలోని అంశాలను అధ్యయనం చేశాడు. దర్శకుడి మార్గదర్శకత్వంతో పాటు, తన సొంత శ్రమతో ఈ పాత్రను మరింత లోతుగా అనుభవించేందుకు ప్రయత్నించాడు.

దుల్కర్ సరసన భాగ్య శ్రీ భోర్సే కథానాయికగా నటిస్తోంది. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. అన్ని పనులు పూర్తిచేసి వేసవిలో సినిమాను విడుదల చేయాలని చిత్రబృందం ప్రయత్నిస్తోంది. విభిన్నమైన కథాంశం, 1950ల కాలం నాటి మద్రాస్ వాతావరణం, దుల్కర్ అభినయం.. ఈ అన్ని అంశాలూ ‘కాంత’ సినిమాపై భారీ అంచనాలను పెంచాయి. మరి ఈ సినిమా దుల్కర్ కు ఏ రేంజ్ లో సక్సెస్ ను అందిస్తుందో చూడాలి.

Tags

Next Story