
శంకర్ బాటలో మురుగదాస్ !

టాప్ డైరెక్టర్ శంకర్ వరుస ఫ్లాప్‌లతో తన క్రేజ్‌ను కోల్పోయాడు. అతని చివరి చిత్రాలు ‘ఇండియన్ 2, గేమ్ చెంజర్’ ఘోర పరాజయాన్ని చవిచూసి.. ఈ సీనియర్ డైరెక్టర్‌కు పెద్ద ఎదురుదెబ్బగా మారాయి. ‘ఇండియన్ 2’ షూటింగ్ ఒక దశలో నిలిపి వేయబడిన తర్వాత, శంకర్ పూర్తిగా ‘గేమ్ చెంజర్’ పై దృష్టి సారించాడు. కానీ ఆ తర్వాత ‘ఇండియన్ 2’ మళ్లీ ప్రారంభం కావడంతో.. ఆ సినిమా ఫలితం ‘గేమ్ చెంజర్’ పై బాగా ప్రభావం చూపింది.
ఇలాంటి పరిస్థితినే ఇప్పుడు మరో దర్శకుడు ఏఆర్ మురుగదాస్ కూడా ఎదుర్కొంటున్నాడు. ప్రస్తుతం అతడు శివకార్తికేయన్ ప్రధాన పాత్రలో నటిస్తోన్న ‘మదరాసి’ చిత్రంతో బిజీగా ఉన్నాడు. అంతేకాదు.. సల్మాన్ ఖాన్ హీరోగా వచ్చిన సికందర్ మూవీని కూడా అతడు డైరెక్ట్ చేశాడు. ఇటీవల విడుదలైన ‘సికందర్’ సినిమా ప్రేక్షకులను అస్సలు మెప్పించలేకపోయింది. భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ చిత్రం పెద్ద డిజాస్టర్‌గా మిగిలింది. తమిళ సినీ పరిశ్రమలో ఎన్నో క్లాసిక్ సినిమాలు అందించిన ఏఆర్ మురుగదాస్ కు ఇది ఊహించని దెబ్బ అని చెప్పుకోవాలి.
ఇప్పటికే మురుగదాస్ తమిళంలో కొన్ని డిజాస్టర్‌లను ఎదుర్కొన్నాడు. ఇప్పుడు ‘సికందర్’ ఫలితం ‘మదరాసి’ పై కూడా ప్రభావం చూపనుందని సినీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ప్రస్తుతం ‘మదరాసి’ పోస్ట్-ప్రొడక్షన్ దశలో ఉంది. ఈ ఏడాది విడుదలకు సిద్ధమవుతోంది. మొత్తానికి ఈ ఇద్దరు టాప్ డైరెక్టర్లు వరుస పరాజయాలతో తమిళ సినీ పరిశ్రమ షాక్‌లో ఉంది. శంకర్, మురుగదాస్ లాంటి అగ్రదర్శకులు బిగ్గెస్ట్ డిజాస్టర్స్‌ను ఇవ్వడం ప్రేక్షకులను, నిర్మాతలను ఆందోళనలోకి నెట్టింది.
-
Home
-
Menu