తమిళ ‘కిల్’ కు హీరో, డైరెక్టర్ వీళ్ళే !

తమిళ ‘కిల్’ కు హీరో, డైరెక్టర్ వీళ్ళే !
X
‘కిల్’ సినిమా తమిళంలో రీమేక్ కాబోతోంది. ఈ రీమేక్‌లో లీడ్ రోల్‌లో కనిపించబోతున్నాడు స్టార్ యాక్టర్ విక్రమ్ కొడుకు ధ్రువ్ విక్రమ్. ఈ ప్రాజెక్ట్‌ను డైరెక్ట్ చేసేది మరెవరో కాదు.. తెలుగు యాక్షన్ మూవీ ‘ఖిలాడి’ ఫేమ్ డైరెక్టర్ రమేష్ వర్మ.

బాలీవుడ్‌లో హై-వోల్టేజ్ యాక్షన్ సినిమాగా సంచలనం సృష్టించిన చిత్రం ‘కిల్’. లక్ష్య హీరోగా నటించగా.. నిఖిల్ నాగేష్ భట్ తెరకెక్కించిన ఈ సినిమా.. ఇటీవల తన మొదటి యానివర్సరీని సెలబ్రేట్ చేసుకుంది. ఇంటెన్స్ వయోలెన్స్, గ్రిప్పింగ్ స్టోరీలైన్‌తో ఈ మూవీ మెయిన్‌స్ట్రీమ్ యాక్షన్ సినిమాల బౌండరీస్‌ను బ్రేక్ చేసి.. ప్రేక్షకులను ఆకట్టుకుంది. కథలోని ఎమోషనల్ డెప్త్‌తో థియేటర్స్‌లో ఓ రేంజ్‌లో ఆడియన్స్‌ను మెస్మరైజ్ చేసింది.

ఇప్పుడు ఓ సూపర్ ఎక్సైటింగ్ అప్‌డేట్. ‘కిల్’ సినిమా తమిళంలో రీమేక్ కాబోతోంది. ఈ రీమేక్‌లో లీడ్ రోల్‌లో కనిపించబోతున్నాడు స్టార్ యాక్టర్ విక్రమ్ కొడుకు ధ్రువ్ విక్రమ్. ఈ ప్రాజెక్ట్‌ను డైరెక్ట్ చేసేది మరెవరో కాదు.. తెలుగు యాక్షన్ మూవీ ‘ఖిలాడి’ ఫేమ్ డైరెక్టర్ రమేష్ వర్మ. తమిళ ఆడియన్స్‌ను టార్గెట్ చేస్తూ, ఈ రీమేక్ స్టైలిష్‌గా, ఎనర్జిటిక్‌గా, మరింత ఇంటెన్స్‌గా రూపొందనుంది. ఒరిజినల్ ‘కిల్’ స్పిరిట్‌ను కంటిన్యూ చేస్తూనే, తమిళ సినిమా సెన్సిబిలిటీస్‌కు తగ్గట్టు కొత్త ఫ్లేవర్‌ను జోడించబోతోంది.

సపోర్టింగ్ కాస్ట్, మూవీ టైటిల్, ప్రొడక్షన్ షెడ్యూల్ వంటి డీటెయిల్స్ త్వరలో అఫీషియల్‌గా అనౌన్స్ కానున్నాయి. ఇంక ధ్రువ్ విక్రమ్ తన తదుపరి భారీ ప్రాజెక్ట్ ‘బైసన్’ కోసం సిద్ధమవుతున్నాడు. ఈ చిత్రాన్ని ప్రఖ్యాత దర్శకుడు మారి సెల్వరాజ్ తెరకెక్కిస్తున్నాడు. అనుపమ పరమేశ్వరన్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. బైసన్ అక్టోబర్ 17, 2025న థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ సినిమా ధ్రువ్ విక్రమ్ కెరీర్‌లో మరో మైలురాయిగా నిలవనుంది.

Tags

Next Story