ప్రయోగాత్మక పాత్రతో అదరగొట్టబోతున్న ధనుష్ !

ప్రయోగాత్మక పాత్రతో అదరగొట్టబోతున్న ధనుష్ !
X
శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కబోతున్న తెలుగు, తమిళ ద్విభాషా చిత్రం ‘కుబేర’.

వైవిధ్యమైన పాత్రలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటూ తన ప్రతిభను నిరూపించుకున్న తమిళ స్టార్ ధనుష్. ఇప్పుడొక కొత్త ప్రయోగానికి సిద్ధమయ్యాడు. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కబోతున్న తెలుగు, తమిళ ద్విభాషా చిత్రం ‘కుబేర’. ఇందులో ధనుష్ బిచ్చగాడి పాత్రలో కనిపించబోతుండడం అందరినీ ఆశ్చర్య పరుస్తోంది. ఇప్పటికే పలు విభిన్న పాత్రల్లో నటించి ప్రఖ్యాతి పొందిన ధనుష్.. ఈ పాత్ర ద్వారా తన నటనను మరోస్థాయికి తీసుకెళ్తాడని ఆశిస్తున్నారు.

ఈ చిత్రానికి సంబంధించి దర్శకుడు శేఖర్ కమ్ముల ఓ మీడియా ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలను వెల్లడించారు. "ఈ పాత్ర కోసం మొదట ధనుష్‌ను సంప్రదించడానికి సందేహించాను. కానీ, కథ చెప్పే సమయంలో ఆయన నా పని శైలిని, చిత్రాలను ఎంతో అభినందించారు ధనుష్ . కథను ఓపికగా విని వెంటనే అంగీకరించారు. ఆయన నిరాడంబరత నిజంగా ఆశ్చర్యకరమైంది," అని అన్నారు.

ఈ చిత్రంలో అక్కినేని నాగార్జున కూడా ఓ కీలక పాత్రలో కనిపించనున్నారు. ధనుష్, నాగార్జున మధ్య సన్నివేశాలు సినిమాలో ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయని చిత్ర యూనిట్ చెబుతోంది. కుబేర చిత్రాన్ని ఏషియన్ ఫిల్మ్స్, అమిగోస్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. గత రెండు సంవత్సరాలుగా ఈ చిత్రం చిత్రీకరణ దశలో ఉంది. నిర్మాణానికి సంబంధించిన జాగ్రత్తల కారణంగా సినిమా విషయంలో ఎలాంటి రాజీ పడలేదని నిర్మాతలు పేర్కొన్నారు. విడుదల తేదీ త్వరలోనే ప్రకటించనున్నట్లు సమాచారం.

Tags

Next Story