తన హోం మార్కెట్ పై ఫోకస్ పెట్టిన ధనుష్ !

ప్రస్తుతం హీరో ధనుష్ సౌత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో మల్టీ-టాలెంటెడ్ పవర్‌హౌస్‌లా మెరిసిపోతున్నాడు. తమిళ, తెలుగు, హిందీ సినిమాల్లో ఒకేసారి సినిమాలు చేస్తూ, ఒక్కో ఇండస్ట్రీలోనూ తనదైన ముద్ర వేస్తున్నాడు. ఇటీవల తెలుగులో వచ్చిన "కుబేర" సినిమాతో ఉభయ తెలుగు రాష్ట్రాల్లో సూపర్ హిట్ కొట్టిన ఈ స్టార్.. ఇప్పుడు బాలీవుడ్ లోనూ ఓ భారీ ప్రాజెక్ట్‌ను కంప్లీట్ చేసి మళ్లీ హెడ్‌లైన్స్‌లో నిలిచాడు. బాలీవుడ్ డైరెక్టర్ ఆనంద్ ఎల్. రాయ్ దర్శకత్వంలో ధనుష్ "తేరే ఇష్క్ మే" అనే సినిమా షూటింగ్‌ను రీసెంట్‌గా ముగించాడు. ఈ కాంబో గతంలో "రాంఝాణా" వంటి కల్ట్ క్లాసిక్‌ను అందించిన సంగతి తెలిసిందే. ఇది వీళ్ల మధ్య మూడో ప్రాజెక్ట్.
ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఇది ధనుష్‌తో ఆమె మొదటి ఆన్-స్క్రీన్ జోడీ కావడం విశేషం. సంగీత దిగ్గజం ఏ.ఆర్. రెహమాన్ ఈ చిత్రానికి మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు. ఇది సినిమాకి మరో హైలైట్. ఈ మూవీ నవంబర్ 28, 2025న థియేటర్లలో సందడి చేయనుంది. అభిమానుల్లో ఇప్పటికే భారీ ఎక్స్‌పెక్టేషన్స్ క్రియేట్ చేస్తోంది ఈ మూవీ. ఈ సినిమాను షూటింగ్ ను విజయవంతంగా పూర్తి చేసిన ధనుష్, ఇప్పుడు తన ఫోకస్‌ను మళ్లీ తమిళ సినిమా వైపు మళ్లించాడు.
"కుబేర" తెలుగు రాష్ట్రాల్లో బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్ అయినప్పటికీ, తమిళనాడులో మాత్రం ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేదు. ఈ నేపథ్యంలో, తన హోమ్ మార్కెట్ అయిన తమిళ సినిమా ఇండస్ట్రీలో మళ్లీ తన స్టార్‌డమ్‌ను రీ-ఎస్టాబ్లిష్ చేయడానికి ధనుష్ ప్లాన్ చేస్తున్నాడు. తన నెక్స్ట్ తమిళ ప్రాజెక్ట్‌లతో అభిమానులను ఆకట్టుకోవడానికి, మరోసారి బాక్సాఫీస్ ఝలక్ ఇవ్వడానికి రెడీ అవుతున్నాడు. ఇలా.. మల్టీ-లింగ్వల్ ప్రాజెక్ట్‌లతో ఫుల్ జోష్‌లో ఉన్న ధనుష్, తన వర్సటైల్ యాక్టింగ్, డైరెక్షన్ స్కిల్స్‌తో ఇండియన్ సినిమాలో తన రేంజ్‌ను మరింత విస్తరిస్తూ, అభిమానులకు బ్యాక్-టు-బ్యాక్ ఎంటర్‌టైన్‌మెంట్ ఇవ్వడానికి సిద్ధమవుతున్నాడు.
-
Home
-
Menu