అజిత్ - ధనుష్ కాంబో మూవీ ఖాయం !

కోలీవుడ్ లో మరో ఆసక్తికరమైన ప్రాజెక్ట్‌కు సంబంధించిన వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి. స్టార్ హీరో, డైరెక్టర్ ధనుష్ తన తదుపరి చిత్రాన్ని 'విడాముయర్చి' ఫేమ్ అజిత్ కుమార్‌తో కలిసి చేయనున్నాడని సమాచారం. ఈ విషయంపై అధికారికంగా స్పష్టత వచ్చింది. ఈ చిత్ర నిర్మాత ఆకాష్ భాస్కరన్ తాజా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. “అజిత్ అండ్ ధనుష్ కాంబినేషన్ సినిమాపై చర్చలు కొనసాగుతున్నాయి. ఇది ఇంకా ప్రారంభ దశలో ఉంది” అని తెలిపారు. ఇది తమిళ సినీ అభిమానులకు పక్కా విజువల్ ట్రీట్ అవుతుందని చెప్పొచ్చు.
ధనుష్ దర్శకత్వం వహించిన తాజా చిత్రం 'నిలావుక్కు ఎన్ మేల్ ఎన్నడీ కోపం' మంచి విజయాన్ని సాధించింది. ఈ జనరేషన్ యువతను ఆకట్టుకునే లవ్ స్టోరీగా రూపొందిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లు రాబట్టింది. అలాగే, పవిష్, మాథ్యూ థామస్, ప్రియా ప్రకాష్ వారియర్ వంటి కొత్త నటీనటులను ఇండస్ట్రీకి పరిచయం చేసింది. ఇక ధనుష్ తన మరో డైరెక్ట్ చేసిన చిత్రం 'ఇడ్లీ కడై' లో నిత్యా మీనన్‌తో కలిసి నటించనున్నాడు. ఈ సినిమా తొలుత ఏప్రిల్ 10 విడుదలకు సిద్ధమవ్వగా.. తాజా సమాచారం మేరకు అది వాయిదా పడినట్లు తెలుస్తోంది.
మరోవైపు, అజిత్ కుమార్ నటించిన 'విడాముయర్చి' చిత్రం బాక్సాఫీస్ వద్ద పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. కానీ, త్వరలోనే ఆయన ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ అనే సినిమాతో మళ్లీ ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. దర్శకుడు అధిక్ రవిచంద్రన్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా అజిత్‌ను మాస్ అవతారంలో చూపించనుంది. ధనుష్ - అజిత్ కాంబినేషన్ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడికానున్నాయి.
-
Home
-
Menu