ధనుష్ 56 చిత్రం షురూ అయింది !

కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్, వెరైటీ చిత్రాల దర్శకుడు మారి సెల్వరాజ్ గతంలో ‘కర్ణన్’ సినిమా చేశారు. ఆ సినిమా విడుదలై నేటికి నాలుగేళ్లు పూర్తవుతున్న సందర్భంగా ఈ డ్యూయో మళ్లీ కలసి పనిచేసే రెండో చిత్రాన్ని ప్రకటించారు. తాత్కాలికంగా డీ56 అనే పేరు పెట్టిన ఈ సినిమా పీరియాడిక్ నేపథ్యంలో రూపొందనుందని సమాచారం. “రూట్స్ బిగిన్ ఏ గ్రేట్ వార్” అనే ట్యాగ్‌లైన్‌తో ఈ ప్రాజెక్ట్‌కు శుభారంభం జరిగింది.
ఈ సందర్భంగా దర్శకుడు మారి సెల్వరాజ్ సోషల్ మీడియాలో ఒక స్పెషల్ లుక్‌ను విడుదల చేశాడు. అలాగే తన మరియు ధనుష్ కలిసి ఉన్న ఫోటోను కూడా షేర్ చేశాడు. “కర్ణన్ తో ప్రారంభమైన ప్రయాణానికి నాలుగేళ్లు పూర్తయిన ఈ రోజున ఎంతో భావోద్వేగంతో ఉన్నాను. ఈ నాలుగేళ్లుగా కర్నన్‌ను ప్రేమించి, ఆదరించిన ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక ధన్యవాదాలు’’ అని మారీ సెల్వరాజ్ ఆ పోస్ట్ లో తెలిపాడు.
ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడించనున్నారు. అయితే ఈ సినిమాను వెల్స్ ఫిల్మ్ ఇంటర్నేషనల్ పతాకంపై ఇషారి కె. గణేశ్ నిర్మించనున్నట్లు ఇప్పటికే ధృవీకరించారు. ధనుష్ – మారి సెల్వరాజ్ గత కలయిక అయిన ‘కర్నన్’ 2021లో విడుదలై గొప్ప విజయాన్ని సాధించింది. ఈ చిత్రం ఒక తక్కువ జాతి సామాజిక వర్గానికి చెందిన యువకుడు కర్ణన్.. తన గ్రామ ప్రజల కోసం సాగించిన పోరాటాన్ని శక్తివంతంగా చూపించింది. సామాజిక న్యాయం, అధికారుల వేధింపులు, గ్రామ ప్రజల హక్కుల కోసం సాగిన ఉద్యమం ఈ కథలో ప్రధానాంశం.
ఇంక ఈ చిత్రంలో ధనుష్‌తో పాటు రజిషా విజయన్, లాల్, యోగి బాబు, లక్ష్మీ ప్రియ చంద్రమౌళి వంటి నటులు కీలక పాత్రల్లో కనిపించారు. ధనుష్ ప్రస్తుత వర్క్ ఫ్రంట్ విషయానికి వస్తే .. ఆయన నటించిన ‘కుబేరా’ అనే సోషియల్ థ్రిల్లర్ మూవీ 2025 జూన్ 20న విడుదలకు సిద్ధమవుతోంది. అలాగే ‘ఇడ్లీ కడై’, ‘తేరీ ఇష్క్ మే’ వంటి సినిమాలు కూడా ఆయన లైనప్‌లో ఉన్నాయి. మొత్తానికి, ధనుష్, మారి సెల్వరాజ్ కాంబో మళ్లీ ప్రేక్షకులను ఉర్రూతలూగించేందుకు సిద్ధమవు తున్నందుకు అభిమానులు ఎంతో ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారు.
#D56 Roots begin a Great War
— Dhanush (@dhanushkraja) April 9, 2025
A @mari_selvaraj film pic.twitter.com/3yfhd6B2pZ
-
Home
-
Menu