ఢిల్లీ రిటర్న్స్... కన్ఫామ్ అయింది !

కోలీవుడ్ స్టార్ హీరో కార్తీ, లోకేష్ కనగరాజ్ కాంబో లో రూపొందిన హై యాక్టెన్ యాక్షన్ మూవీ ‘ఖైదీ’. ఈ సినిమా భారీ విజయాన్ని సాధించిన తర్వాత.. దాని సీక్వెల్ ‘ఖైదీ 2’ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే.. దర్శకుడు లోకేష్ కనగరాజ్ ఇతర ప్రాజెక్టులతో బిజీగా ఉండటంతో ఈ సినిమా మళ్లీ వాయిదా పడుతుందని అనేక ఊహాగానాలు వినిపించాయి.
ఈ నేపథ్యంలో.. తాజాగా కార్తీ, లోకేష్ కనగరాజ్ కలిసి ఈ ప్రచారానికి ముగింపు పలికారు. సోషల్ మీడియాలో కార్తీ ఓ ఆసక్తికరమైన పోస్ట్ షేర్ చేస్తూ.. ‘ఢిల్లీ రీటర్న్స్’ అంటూ అధికారిక ప్రకటన చేశాడు. పోస్ట్‌లో కార్తీ, లోకేష్ కనగరాజ్‌కి ఆయన ప్రత్యేకమైన కడియంను చేతికి వేసి ఇస్తున్న ఫోటోని కూడా పంచుకున్నారు.
ఈ అప్‌డేట్‌ను షేర్ చేస్తూ కార్తీ.. ‘ఢిల్లీ రీటర్న్స్.. మరో అద్భుతమైన సంవత్సరం కావాలి లోకేష్ కనగరాజ్ గారూ.. అని రాశాడు. అంతేకాదు.. ఈ పోస్ట్‌లో ‘ఖైదీ’ చిత్ర నిర్మాతలు డ్రీమ్ వారియర్ పిక్చర్స్, టాక్సిక్ నిర్మాణ సంస్థ కేవీఎన్ ప్రొడక్షన్స్‌ను ట్యాగ్ చేయడం ద్వారా ఓ కొత్త కలయికకు సంకేతం ఇచ్చారు. లోకేష్ కనగరాజ్ తన గత సినిమాల ద్వారా ప్రేక్షకులను ఆకట్టుకున్న నేపథ్యంలో.. ఈ సీక్వెల్ ఎలా ఉండబోతుందో చూడాలని ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
-
Home
-
Menu