ఎమోషనల్ డైరెక్టర్ తో చియాన్ విక్రమ్ ?

కోలీవుడ్ లో తనదైన ముద్ర వేసిన సెన్సిబుల్ డైరెక్టర్ ప్రేమ్ కుమార్.. ‘96, మెయ్యళగన్’ వంటి రెండు అద్భుతమైన ఎమోషనల్ ఎంటర్‌టైనర్‌లతో ప్రేక్షకుల్ని కట్టిపడేశారు. ఈ రెండు సినిమాలు కేవలం విమర్శకుల ప్రశంసలు మాత్రమే కాక, తమిళనాడు అంతటా బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లతో సందడి చేశాయి. ముఖ్యంగా ‘96’ సినిమా హార్ట్ టచింగ్ కథాంశం, అద్భుతమైన దర్శకత్వంతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. అయితే, ఈ సినిమాను తెలుగు వెర్షన్ ‘జాను’గా ప్రేక్షకులను నిరాశపరిచింది.
ప్రస్తుతం ప్రేమ్ కుమార్ కాస్త బ్రేక్ తీసుకుని.. తన తదుపరి ప్రాజెక్ట్‌ల కోసం బిజీగా ఉన్నారు. ఆయన ఒకేసారి మల్టీ స్క్రిప్ట్స్ పై వర్క్ చేస్తున్నారు. అయితే అభిమానులకు ఓ గుడ్ న్యూస్ కూడా షేర్ చేశారు. ‘96’ సినిమాకు సీక్వెల్‌గా మరో చిత్రం ప్లాన్ చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. స్క్రిప్ట్ ఫైనల్ అయిన వెంటనే ఈ ప్రాజెక్ట్ గురించి మరిన్ని డీటెయిల్స్ బయటకు వచ్చే అవకాశం ఉంది. అభిమానులు ఈ సీక్వెల్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు, ఎందుకంటే ‘96’ సినిమా వారి హృదయాల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకుంది.
ఇదిలా ఉంటే.. తమిళ మీడియాలో వస్తున్న స్పెక్యులేషన్స్ ప్రకారం.. ప్రేమ్ కుమార్ ఇప్పుడు ఓ భారీ యాక్షన్ డ్రామా స్క్రిప్ట్‌ను రెడీ చేశారట. ఈ స్క్రిప్ట్‌ను ఆయన స్టార్ హీరో చియాన్ విక్రమ్‌కు వినిపించారు. విక్రమ్ ఈ కథకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని టాక్. ఈ ప్రాజెక్ట్‌ను ప్రముఖ నిర్మాణ సంస్థ వెల్స్ ఫిల్మ్ ఇంటర్నేషనల్ టేకప్ చేయనుంది. ఈ సినిమా షూటింగ్ 2026 ప్రారంభంలో స్టార్ట్ కానుంది. ప్రస్తుతం ప్రేమ్ కుమార్ స్క్రిప్ట్‌ను మరింత ఫైన్‌ట్యూన్ చేసే పనిలో ఉన్నారు. ఈ యాక్షన్ డ్రామానే ‘96’ సీక్వెల్‌కు ముందు ఆయన తదుపరి చిత్రంగా రూపొందనుంది.
మరోవైపు.. చియాన్ విక్రమ్ ప్రస్తుతం తన ఇతర ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉన్నారు. ఆయన తన ప్రస్తుత కమిట్‌మెంట్స్‌ను పూర్తి చేసిన తర్వాత, ప్రేమ్ కుమార్ డైరెక్షన్‌లో ఈ కొత్త సినిమా కోసం సెట్స్‌పైకి రానున్నారు. ఈ కాంబినేషన్‌పై ఇప్పటికే అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఎందుకంటే ప్రేమ్ కుమార్ సెన్సిటివ్ స్టోరీటెల్లింగ్, విక్రమ్ ఇంటెన్స్ పెర్ఫార్మెన్స్ కలిస్తే ఖచ్చితంగా స్క్రీన్‌పై మ్యాజిక్ క్రియేట్ అవుతుందని అందరూ భావిస్తున్నారు. మరి ప్రేమ్ విక్రమ్ కోసం ఎలాంటి కథ రాసుకున్నాడో.
-
Home
-
Menu