దుమ్మురేపుతోన్న క్యాథరిన్ స్పెషల్ సాంగ్ !

అందాల హీరోయిన్ క్యాథరిన్ ట్రెస్సా తిరిగి తమిళ సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన తీరు నిజంగా సంచలనంగా మారింది. తన ఎలిగెంట్ స్క్రీన్ ప్రెజెన్స్, హాటెండ్ పెర్ఫార్మెన్స్ కు కేరాఫ్ అడ్రెస్ అయిన క్యాథరిన్.. ‘గ్యాంగర్స్’ తమిళ చిత్రంలో ప్రత్యేకంగా తెరకెక్కించిన ‘కుప్పన్’ పాటతో కోలీవుడ్‌ను మరోసారి తనవైపు తిప్పుకుంది. దర్శకుడు, నటుడు సుందర్.సి తెరకెక్కిస్తున్న కామెడీ ఎంటర్టైనర్ ‘గ్యాంగర్స్’లో ఈ స్పెషల్ సాంగ్ చోటు చేసుకుంది. మజా ఏమిటంటే.. ఈ సినిమాతో సుందర్.సి, వడివేలు కాంబినేషన్ 15 ఏళ్ల తర్వాత రీయూనియన్ కాబోతోంది. ఆ ఇద్దరి హాస్య కాంబో ఇప్పటికే ప్రేక్షకుల్లో ఆసక్తి రేకెత్తిస్తుంటే.. క్యాథరిన్ స్పెషల్ సాంగ్ ఆ సినిమాకి మరింత వన్నె తెచ్చింది.
ఇటీవల ‘అచ్చచో’ అనే హిట్ పాటతో ‘అరణ్మణై 4’లో తమన్నా, రాశీఖన్నా జోడీ అలరించిన నేపథ్యంలో.. ఆ ఫార్ములానే మరోసారి క్యాథరిన్ ద్వారా ప్రయో గించారని అనిపిస్తోంది. తమిళ పరిశ్రమలో కొంతకాలంగా కనిపించకుండా పోయిన క్యాథరిన్.. మొదటిసారి ‘మద్రాస్’ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. అనంతరం పలు తెలుగు సినిమాలలో నటించి మంచి గుర్తింపు పొందింది. అయితే ‘గ్యాంగర్స్’ చిత్రంతో ఆమె మళ్లీ తన మొదటి అడుగులకు తిరిగివచ్చినట్టైంది.
ఈ పాటకు యూట్యూబ్ లో ఇప్పటికే మిలియన్ల వ్యూస్ వస్తుండగా.. ఆమె డ్యాన్స్ ముూవ్స్, ఎక్స్‌ప్రెషన్స్ పై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. వాస్తవానికి ఈ పాట సినిమాకే ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందనే భావన సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ఈ నెల 24న ‘గ్యాంగర్స్’ విడుదలకు సిద్ధంగా ఉండగా, ఈ స్పెషల్ సాంగ్ సినిమాకు ఎంత బజ్ తీసుకురాస్తుందో చూడాల్సిన విషయం. అయితే క్యాథరిన్ ట్రెస్సా చేసిన ఈ గ్లామరస్ రీ-ఎంట్రీ మాత్రం అభిమానుల మనసు దోచేస్తోందనడంలో ఎలాంటి సందేహం లేదు.
-
Home
-
Menu