‘పరాశక్తి’ లో టాలెంటెడ్ మల్లూ యాక్టర్ ?

‘పరాశక్తి’ లో టాలెంటెడ్  మల్లూ యాక్టర్ ?
X
తాజాగా మలయాళ నటుడు, దర్శకుడు బేసిల్ జోసఫ్ కూడా ఈ సినిమా లో నటిస్తున్నాడనే వార్తలు వినిపిస్తున్నాయి.

శివ కార్తికేయన్, జయం రవి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం "పరాశక్తి". ఈ సినిమా చిత్రీకరణ దశలో ఉండగా.. కాస్టింగ్ రోజురోజుకు విస్తరిస్తోంది. తాజాగా మలయాళ నటుడు, దర్శకుడు బేసిల్ జోసఫ్ కూడా ఈ సినిమా లో నటిస్తున్నాడనే వార్తలు వినిపిస్తున్నాయి. శ్రీలంకలో చిత్రీకరణ జరుగుతున్న "పరాశక్తి" సెట్స్‌లో బేసిల్ జోసఫ్, జయం రవి పక్కపక్కన కూర్చున్న ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

అయితే, అతని పాత్ర గురించి ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు. కానీ అతను గెటప్‌లో కనిపించడం వల్ల సినిమాలో ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నట్లు భావిస్తున్నారు. ఇదే నిజమైతే, ఇది బేసిల్ జోసఫ్‌కు తొలి తమిళ సినిమా అవుతుంది. ఈ చిత్రానికి సుధా కొంగర దర్శకత్వం వహిస్తున్నారు. ఇది 1965లో తమిళనాడులో జరిగిన యాంటి-హిందీ ఆందోళనలు ఆధారంగా రూపొందుతున్న పీరియడ్ పొలిటికల్ డ్రామా.

శ్రీలీల కథానాయికగా నటిస్తుండగా.. అథర్వ మురళి కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఇక బేసిల్ జోసఫ్ కూడా కాస్ట్‌లో చేరినట్లు తెలుస్తుండగా.. దేవ్ రామనాథ్, పృథ్వీ రాజన్, గురు సోమసుందరం కూడా ఈ సినిమాలో ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి జివి ప్రకాశ్ కుమార్ సంగీతం అందిస్తున్నారు.

Tags

Next Story