‘జైలర్ 2’లో బాలకృష్ణ గెస్ట్ అప్పీరెన్స్?

సూపర్ స్టార్ రజనీకాంత్ మళ్లీ తన అభిమానులకు మాస్ ట్రీట్ ఇవ్వడానికి సిద్ధమవుతున్నాడు. ‘జైలర్’ భారీ విజయం తర్వాత సీక్వెల్ 'జైలర్ 2'ని మరింత భారీ స్థాయిలో తెరకెక్కించబోతున్నారు. రజనీకాంత్ ప్రస్తుతం లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘కూలీ’ షూటింగ్‌లో పాల్గొంటున్నాడు. ఇక వచ్చే వారం నుంచి ‘జైలర్ 2’ సెట్స్‌లో అడుగుపెట్టనున్నాడట సూపర్ స్టార్.
ఈ సీక్వెల్‌లో మరోసారి మోహన్‌లాల్, శివ రాజ్‌కుమార్ కీలక పాత్రల్లో కనిపించనున్నారని సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అయితే తెలుగునాట ఈ సినిమాపై ఆసక్తిని పెంచుతున్న విషయం నటసింహం బాలకృష్ణ ఇందులో భాగస్వామ్యమవ్వబోతున్నాడని. బాలకృష్ణ, రజనీకాంత్ మధ్య ఉన్న సుదీర్ఘ స్నేహబంధంతో ఈ మూవీలో నటసింహం కేమియోలో మురిపించబోతున్నాడనే న్యూస్ కొన్ని రోజులుగా సర్క్యులేట్ అవుతుంది. అయితే దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
ఈ ఏడాది ప్రారంభంలో విడుదలైన ‘జైలర్ 2’ గ్లింప్స్ కు ట్రెమండస్ రెస్పాన్స్ దక్కింది. సన్ పిక్చర్స్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ చిత్రం ఇప్పటికే ప్రేక్షకుల్లో భారీ అంచనాలను పెంచింది. ఈ ప్రాజెక్ట్ రజనీకాంత్ కెరీర్‌లో మరో బ్లాక్‌బస్టర్‌గా నిలిచే అవకాశముందని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
-
Home
-
Menu