అప్పుడు మిస్ అయినా.. ఇప్పుడు సెట్ అయిందా?

అప్పుడు మిస్ అయినా.. ఇప్పుడు సెట్ అయిందా?
X
సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన 'జైలర్' సినిమాకు సీక్వెల్ ‘జైలర్ 2’ ప్రస్తుతం సెట్స్ పై ఉన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో నందమూరి బాలకృష్ణ ఓ ముఖ్యమైన పాత్రలో కనిపించనున్నారని ప్రచారం జరుగుతోంది.

నటసింహం నందమూరి బాలకృష్ణ సినిమాల పరంగా అద్బుతమైన విజయాలతో ముందుకు సాగుతున్నారు. వరుసగా విజయవంతమైన చిత్రాలతో తన కెరీర్ లో కొంత స్థిరత్వాన్ని ఆయన కొనసాగిస్తున్నారు. ఇక తాజా సమాచారం ప్రకారం బాలకృష్ణ ఓ పెద్ద ప్రాజెక్టులో కీలక పాత్ర పోషించనున్నారని ఊహాగానాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన 'జైలర్' సినిమాకు సీక్వెల్ ‘జైలర్ 2’ ప్రస్తుతం సెట్స్ పై ఉన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో నందమూరి బాలకృష్ణ ఓ ముఖ్యమైన పాత్రలో కనిపించనున్నారని ప్రచారం జరుగుతోంది. ఈ వార్త సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. అభిమానుల మధ్య ఎన్నో చర్చలు, ఊహాగానాలు సాగుతున్నాయి. ఇంతకు ముందు బాలకృష్ణ 'జైలర్' మొదటి భాగంలోనే నటించాల్సి ఉండగా, కొన్ని అనివార్య కారణాల వల్ల అది సాధ్యపడలేదు. కానీ ఇప్పుడు మాత్రం సీక్వెల్‌లో ఆయనను తీసుకోవాలని చిత్ర బృందం తీవ్రంగా ఆలోచిస్తుందట.

ఈ ప్రచారం నిజమే అయితే.. బాలకృష్ణ రజినీకాంత్, మోహన్‌లాల్, శివరాజ్‌ కుమార్‌లతో కలిసి స్క్రీన్‌ను పంచుకునే అవకాశముంది. ఇది దక్షిణాది సినిమాపరిశ్రమలోని అత్యుత్తమ నటుల కలయికగా చరిత్రలో నిలిచిపోవచ్చు. బాలకృష్ణ ఇప్పటికే తన నెక్స్ట్ ఫిల్మ్ అయిన 'అఖండ 2' పనుల్లో బిజీగా ఉన్నారు. ఈ ప్రాజెక్టు కోసం బాలయ్య డేట్స్ కేటాయించాల్సి రావచ్చు. ఈ వార్త నిజమైతే, రజినీకాంత్ సినిమా కోసం బాలకృష్ణ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Tags

Next Story