వివాదాలకు కారణమవుతోన్న ఒకే ఒక తమిళ చిత్రం !

వివాదాలకు కారణమవుతోన్న ఒకే ఒక తమిళ చిత్రం !
X
ఈ చిత్ర కథాంశం ప్రధానంగా బ్రాహ్మణ కుటుంబానికి చెందిన ఒక సంప్రదా యబద్ధమైన అమ్మాయి చుట్టూ తిరుగుతుంది.

ఈ నెలలో ఒక ప్రత్యేకమైన తమిళ చిత్రం చాలా వివాదాలకు దారితీస్తోంది. ఆ చిత్రం పేరు “బ్యాడ్ గాళ్ ”. ఈ సినిమా సాధారణ తమిళ చిత్రం కాదు. ఎందు కంటే దీనికి వేట్రిమారన్, అనురాగ్ కశ్యప్ లాంటి క్రేజీ ఇండియన్ డైరెక్టర్స్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.

ఈ చిత్ర కథాంశం ప్రధానంగా బ్రాహ్మణ కుటుంబానికి చెందిన ఒక సంప్రదా యబద్ధమైన అమ్మాయి చుట్టూ తిరుగుతుంది. ఆమె తన జీవితాన్ని తప్పుదారిలో నడిపించుకుని, అసాంఘిక కార్యకలాపాలకు బానిసగా మారుతుంది. అంతేకాదు, ఆమె కుటుంబసభ్యులను బెదిరిస్తూ, తన అలవాట్లను ఆపే ప్రయత్నం చేస్తే ఆత్మహత్య చేసుకుంటానని బెదిరిస్తుంది.

సినిమాటిక్ లిబర్టీ కోణంలో ఇది అర్థమవుతున్నా.. ఈ చిత్రం ప్రధానంగా బ్రాహ్మణులపై వ్యతిరేక నారేటివ్‌ను సృష్టిస్తోందనే విమర్శలకు గురవుతోంది. ఇది సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున దుమారాన్ని రేపుతోంది. ఈ సినిమా బ్రాహ్మణ సంస్కృతి, సాంప్రదాయాలకు వ్యతిరేకంగా చూపించడానికే ఉద్దేశించిందని కొందరు అభిప్రాయపడుతున్నారు.

ఇదే నారేటివ్ ఇక్కడితో ఆగలేదు. తమిళ సినిమా పరిశ్రమకు చెందిన కొందరు వ్యక్తులు కూడా ఈ చిత్రాన్ని బ్రాహ్మణ వ్యతిరేక ప్రోపగాండా అని విమర్శిస్తున్నారు. బ్రాహ్మణ కుటుంబాలపై ఏజెండా నడపడమే లక్ష్యంగా వేట్రిమారన్, అనురాగ్ కశ్యప్ లు ఈ సినిమా తీశారని భావిస్తున్న కొందరు అసహనం వ్యక్తం చేస్తున్నారు.

ఈ సినిమా ప్రస్తుతం దక్షిణాది సినిమా పరిశ్రమలో భారీ చర్చనీయాంశంగా మారింది. ఈ చిత్ర కథాంశం మరియు దానితో వచ్చిన సామాజిక ప్రభావం గురించి ప్రజలు పెద్ద ఎత్తున చర్చిస్తున్నారు. ఇలాంటి ప్రోవొకేటివ్ సినిమాలు వెంటనే నిషేధించాల్సిన అవసరం ఉందని, సామాజిక సమతుల్యతకు హాని కలిగించే చిత్రాలు తీయకూడదని చాలా మంది పిలుపునిస్తున్నారు.

Tags

Next Story