మళ్లీ వార్తల్లోకి ‘బ్యాడ్ గాళ్’ వివాదం !

మళ్లీ వార్తల్లోకి ‘బ్యాడ్ గాళ్’ వివాదం !
X

సాధారణంగా సినిమాలు విడుదలైన తర్వాతే వివాదాలు, చర్చలు రావడం కనిపిస్తుంది. కానీ, ‘బ్యాడ్ గాళ్’ అనే తమిళ చిత్రం మాత్రం విడుదలకు ముందే చర్చనీయాంశంగా మారింది. ఈ చిత్ర టీజర్ విడుదలైనప్పటి నుంచే ఎన్నో విమర్శలు, వివాదాలు మొదలయ్యాయి. ప్రఖ్యాత దర్శకుడు వెట్రిమారన్ నిర్మిస్తున్న ఈ చిత్రం... కేవలం టీజర్‌తోనే విపరీతమైన దృష్టిని ఆకర్షించింది. ముఖ్యంగా.. ఈ సినిమా తమిళ సమాజంలోని అగ్ర కులాలపై వ్యంగ్యంగా తెరకెక్కిందని , అగ్రకులాల మహిళల జీవితాన్ని తప్పుదారి పట్టించేలా చిత్రీకరించారని విమర్శలు వస్తున్నాయి.



ఈ నేపథ్యంలో, తమిళ బిగ్ బాస్ సీజన్ 4 పాల్గొన్న నటి సనం శెట్టి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది. ఈ సినిమా టీజర్‌ను చూసిన ఆమె తీవ్ర అసహనానికి లోనయ్యానని.. ఇలాంటి అంశాలను వెట్రిమారన్ వంటి ప్రతిష్టాత్మకమైన వ్యక్తి ప్రోత్సహించడం అసహ్యకరమని చెప్పింది. ఈ వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి. ముఖ్యంగా.. అగ్రకులాల మహిళలను అణగదొక్కేలా ఈ సినిమా ఉంటుందని భావించిన సనం శెట్టి... టీజర్‌లో ఉన్న విషయాలు తమకు అసహ్యంగా అనిపించాయని స్పష్టంగా తెలిపింది. వెట్రిమారన్ లాంటి దిగ్గజం ఇలాంటి చిత్రాన్ని నిర్మించడం తగదని ఆమె అభిప్రాయపడారు.

‘బ్యాడ్ గాళ్’ కథ విషయానికొస్తే.. ఇది ఓ బ్రాహ్మణ యువతిపై ఆధారపడిన కథ. ఈ యువతి చెడు అలవాట్లకు బానిసైపోయి తీవ్ర సమస్యల్లో పడిపోతుంది. కొందరి అభిప్రాయం ప్రకారం.. ఈ సినిమా తమిళనాడు ప్రస్తుతం ఎదుర్కొంటున్న కొన్ని వాస్తవాలను ప్రతిబింబిస్తోందని అంటున్నారు. మరికొందరు మాత్రం ఇది అగ్రకులాల వ్యతిరేక ప్రపగండా చిత్రమని విమర్శిస్తున్నారు. ఈ సినిమా విడుదలైన తర్వాత మరింత వివాదాస్పద అంశాలు వెలుగు చూడొచ్చని సినీ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

Tags

Next Story