ధనుష్ ‘ఇడ్లీ కడై’ లో మరో హీరో ఫిక్స్ !

ధనుష్ ‘ఇడ్లీ కడై’ లో మరో హీరో ఫిక్స్ !
X
కొత్తగా విడుదలైన పోస్టర్‌లో అరుణ్ విజయ్ బాక్సర్ పాత్రలో కనిపించగా.. ధనుష్ ఆయన కోచ్‌గా దర్శనమిచ్చాడు.

తమిళ స్టార్ హీరో ధనుష్ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘ఇడ్లీ కడై’. ఇందులో యంగ్ హీరో .. అరుణ్ విజయ్ కీలక పాత్ర పోషిస్తున్నట్లు చిత్రబృందం తాజాగా వెల్లడించింది. గత కొంతకాలంగా ‘వనంగాన్’ చిత్రంలో నటిస్తున్న అతడు.. ధనుష్ చిత్రంలో నటిస్తున్నాడనే ఊహాగానాలు వినిపించగా.. ఇప్పుడు ఈ వార్తను అధికారికంగా ధృవీకరించారు మేకర్స్.

కొత్తగా విడుదలైన పోస్టర్‌లో అరుణ్ విజయ్ బాక్సర్ పాత్రలో కనిపించగా.. ధనుష్ ఆయన కోచ్‌గా దర్శనమిచ్చాడు. ఇది ఇంతకు ముందు విడుదలైన పోస్టర్లతో పోలిస్తే విభిన్నంగా ఉండడం గమనార్హం. సోషల్ మీడియా వేదికగా ఈ లుక్‌ను షేర్ చేస్తూ.. చిత్రబృందం “ఇదిగో, అరుణ్ విజయ్ ‘ఇడ్లీ కడై’లో” అంటూ ప్రకటించడంతో పాటు... సినిమా ఏప్రిల్ 10, 2025న విడుదల కానుందని మరోసారి గుర్తు చేసింది టీమ్.

‘ఇడ్లీ కడై’ ధనుష్ దర్శకత్వం వహించిన నాలుగో చిత్రం. ఆయన గతంలో ‘పా పాండీ’, ‘రాయన్’, ‘నీక్’ చిత్రాలను రూపొందించారు. ఈ సినిమా ఫీల్-గుడ్ డ్రామాగా ఉండనుందని సమాచారం. ఇంతకు ముందు విడుదలైన పోస్టర్స్ లో ధనుష్, నిత్యా మీనన్ జంటగా గ్రామీణ నేపథ్యంలో కనిపించగా.. తాజా పోస్టర్ మాత్రం సినిమాలోని మరో కోణాన్ని ఆవిష్కరించింది. నిత్యా మీనన్, శాలిని పాండే, ప్రకాశ్ రాజ్, రాజ్ కిరణ్ వంటి ప్రముఖ నటులు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.

Tags

Next Story