అల్లు అర్జున్ – అట్లీ కాంబో.. మాస్ ఫీస్ట్ రెడీ!

‘పుష్ప 2’తో సంచలన విజయం అందుకున్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నెక్స్ట్ ప్రాజెక్ట్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. త్రివిక్రమ్ శ్రీనివాస్, అట్లీ వంటి స్టార్ డైరెక్టర్స్‌తో అల్లు అర్జున్ సినిమాలను లైన్లో పెట్టాడు. అయితే వీటిలో ప్రస్తుతం అట్లీ ప్రాజెక్ట్ ముందుకు వెళ్లే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు ఫిల్మ్ సర్కిల్స్‌లో చర్చ సాగుతోంది.
బాలీవుడ్‌లో ‘జవాన్’ సినిమాతో దుమ్మురేపి వెయ్యి కోట్లకు పైగా వసూళ్లు సాధించాడు కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ. ఇప్పుడు అతని క్రేజ్ పాన్-ఇండియా స్థాయికి పెరిగిపోయింది. అలాగే 'పుష్ప 2'తో అల్లు అర్జున్ కూడా ఇండియన్ బాక్సాఫీస్ వద్ద సరికొత్త కలెక్షన్ల రికార్డులు కొల్లగొట్టాడు. అలాంటి వీరిద్దరి కాంబోలో సినిమా అంటే ఆ అంచనాలు మామూలుగా ఉండవు.
అల్లు అర్జున్ కోసం అట్లీ ఓ ఇంటర్నేషనల్ బ్యాక్‌డ్రాప్ యాక్షన్ స్టోరీని సెట్ చేశాడట. ఈ సినిమాలో వచ్చే ప్రతీ సన్నివేశం ఎంతో భారీగా.. ఫ్యాన్స్ కు గూస్‌బంప్స్ తెప్పించేలా ఉంటుందట. ఈ ప్రాజెక్ట్‌ను ప్రముఖ నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ దాదాపు రూ.600 కోట్ల బడ్జెట్ తో నిర్మించనున్నట్టు ప్రచారం జరుగుతుంది.
ఈ సినిమాలో అల్లు అర్జున్‌తో పాటు మరో తమిళ స్టార్ నటించనున్నాడని, ముగ్గురు హీరోయిన్‌లు ఈ సినిమాలో ఉంటారు అనేది సినీ వర్గాల్లో నడుస్తోన్న టాక్. మొత్తంగా ఏప్రిల్ 8న అల్లు అర్జున్ బర్త్ డే స్పెషల్ గా ఈ మూవీకి సంబంధించి బిగ్ అనౌన్స్‌మెంట్ రానుందని తెలుస్తోంది.
-
Home
-
Menu