ఓవర్సీస్ లో సైతం వెరీ ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’

ఓవర్సీస్ లో సైతం వెరీ ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’
X
అంతర్జాతీయంగా మిలియన్ డాలర్ క్లబ్‌లో అడుగుపెట్టింది. మొత్తం కలెక్షన్లు ఇప్పుడు రూ.150 కోట్లను క్రాస్ చేయగా, ట్రేడ్ వర్గాల్లో ఇది త్వరలోనే రూ.200 కోట్ల క్లబ్‌లో చేరబోతుందనే విశ్వాసం నెలకొంది.

తమిళ స్టార్ హీరో అజిత్ గత చిత్రం.. ‘విడాముయర్చి’ కి గ్లోబల్‌గా రూ.150 కోట్ల మార్క్ దాటి చాప్టర్ క్లోజ్ అయిందనుకున్న సమయంలో... అతడి రెండవ రిలీజ్ ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ అంచనాలను తలకిందులు చేస్తోంది. అభిమానులు ఊహించని విధంగా, ఈ సినిమా అజిత్ కెరీర్‌లో మరో మైలురాయిని చేరుకోబోతోంది.

ఆదిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ స్టైలిష్ యాక్షన్-డ్రామా ఇప్పటికే తమిళనాడులో రూ.80 కోట్లు దాటగా... అంతర్జాతీయంగా మిలియన్ డాలర్ క్లబ్‌లో అడుగుపెట్టింది. మొత్తం కలెక్షన్లు ఇప్పుడు రూ.150 కోట్లను క్రాస్ చేయగా, ట్రేడ్ వర్గాల్లో ఇది త్వరలోనే రూ.200 కోట్ల క్లబ్‌లో చేరబోతుందనే విశ్వాసం నెలకొంది. హైదరాబాద్‌లో ఇటీవల జరిగిన గ్రాండ్ బ్లాక్‌బస్టర్ సెలబ్రేషన్ ఈ సక్సెస్ ఎంత గొప్పదో చెప్పకనే చెబుతోంది.

ఈ సినిమాలో అజిత్ పోషించిన పాత్ర "రెడ్ డ్రాగన్". ఒక గ్యాంగ్‌స్టర్. ప్రేమ కోసం చీకటి ప్రపంచానికి స్వస్తి చెప్పి, 17 ఏళ్ల తర్వాత తన కొడుకు కిడ్నాప్ కావడంతో మళ్లీ ఆ మార్గంలో అడుగుపెడతాడు. ఈ కథలో ఎమోషన్, యాక్షన్ రెండూ మేళవించి అజిత్ అభిమానులకు కావలసిన అన్ని మసాలాల్ని పుష్కలంగా దట్టించారు.

సాధారణంగా తమిళ సినిమాలు మలేసియా, సింగపూర్ మార్కెట్లలో బలంగా నిలబడతాయి. కానీ, ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ ఈ ట్రెండ్‌ను మార్చేస్తోంది. ఉత్తర అమెరికాలో కొన్ని పెద్ద తెలుగు సినిమాల్ని కూడా వెనక్కి నెట్టేసి అద్భుతమైన వసూళ్లు సాధిస్తోంది. ఇది అజిత్‌కు పెరుగుతున్న పాన్-ఇండియా క్రేజ్‌కు నిదర్శనం. ఇది కేవలం ఒక సినిమా విజయం మాత్రమే కాదు. అజిత్ కుమార్‌కు ఇది మరో పవర్ ఫుల్ కమ్ బ్యాక్ .

Tags

Next Story