సునీల్ పొలిటికల్ ఎంట్రీ.. నిజమేనా?

సినిమా నటులు రాజకీయాల్లోకి వెళ్తున్నారనే చర్చ ఎప్పుడూ ఉంటుంది. ఇప్పుడు కమెడియన్‌గా మొదలై.. నటుడిగా మారిన సునీల్ గురించి అలాంటి పుకార్లు వినిపిస్తున్నాయి. 2024లో సునీల్ 'గేమ్ ఛేంజర్', 'మ్యాడ్ స్క్వేర్', 'గుడ్ బ్యాడ్ అగ్లీ' వంటి పెద్ద సినిమాల్లో నటించి మెప్పించాడు. కానీ.. ఇప్పుడు చర్చ అతని కొత్త సినిమా గురించి కాదు.. రాజకీయాల్లోకి అడుగుపెడతాడనే ఊహాగానాల గురించి.
అయితే.. సునీల్ నిజ జీవితంలో రాజకీయ నాయకుడు కావడం లేదు. ఓ సినిమాలో రాజకీయ నాయకుడి పాత్ర పోషిస్తున్నాడు. కోలీవుడ్ స్టార్ విజయ్ నటిస్తున్న 'జననాయగన్' అనే సినిమాలో సునీల్ ఒక ముఖ్యమైన రాజకీయ నాయకుడి పాత్రలో కనిపించనున్నాడు. ఈ చిత్రానికి హెచ్. వినోద్ దర్శకత్వం వహిస్తున్నాడు.
సునీల్.. విజయ్‌తో స్క్రీన్‌ను పంచుకోనున్నాడని.. అతని వైట్ అండ్ వైట్ రాజకీయ నాయకుడి లుక్ సినిమాలో చాలా ఇంప్రెసివ్ గా ఉంటుందని తెలుస్తోంది. ఎక్కువగా హాస్యం, కేరక్టర్ ఆర్టిస్ట్, విలన్ పాత్రలతో గుర్తింపు పొందిన సునీల్‌కు ఈ కొత్త పాత్ర కెరీర్ బూస్టర్ గా మారుతుందని చెప్పొచ్చు. అందువల్ల.. ఇప్పటికిప్పుడు సునీల్ ఓట్లు అడగడం లేదు కానీ, మనం మాత్రం త్వరలో వెండితెరపై ఆయన కొత్త అవతారాన్ని ఆస్వాదించబోతున్నాం.
-
Home
-
Menu