ఆ సీన్ కథలో కీ ఎలిమెంట్ : అభిరామి

లోకనాయకుడు కమల్ హాసన్, లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం కలయికలో చాన్నాళ్ళ తర్వాత రాబోతున్న మరో చిత్రం ‘థగ్ లైఫ్’. ఈ మూవీ జూన్ 5న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కాబోతోంది. ఈ క్రమంలో రీసెంట్ గా రిలీజైన ట్రైలర్ లో కమల్ అండ్ హీరోయిన్ అభిరామిపై చిత్రీకరించిన కొద్ది సెకన్ల లిప్ లాక్ సీన్ పై విమర్శలు చెలరేగాయి. వాటికి అభిరామి.. తనదైన స్టైల్లో క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసింది.
ఈ విషయంలో అభిరామి టాపిక్‌ని సైడ్ చేయలేదు. అలాగే.. మాటల్లో షుగర్ కోట్ వేయలేదు. ఆమె కూల్‌గా, కాన్ఫిడెంట్‌గా రెస్పాండ్ అయి .. ఆన్లైన్ హైప్‌కి టోటల్ కాంట్రాస్ట్‌గా నిలిచింది. ఇటీవల జరిగిన ఒక ఇంటరాక్షన్‌లో, అభిరామి ఆ సీన్ గురించి ఓపెన్‌గా మాట్లాడింది. "ఆ సీన్ నా ఫుల్ కన్సెంట్‌తో షూట్ చేశాం. అది కథలో టోటల్‌గా రెలెవెంట్‌గా ఉంది.." అని క్లారిటీ ఇచ్చింది. నెటిజన్స్ ఆ మూడు సెకన్ల సీన్‌ని జూమ్ చేసి హైలైట్ చేసినా.. నో ప్రాబ్లెమ్. ఇది కథలో కీ ఎలిమెంట్. దీని బ్యాక్‌గ్రౌండ్ అర్థం చేసుకోవాలంటే ఫుల్ మూవీ చూడాలి," అని ఆమె వైబ్ సెట్ చేసింది.
ట్రైలర్లో కొన్ని సెకన్లు చూసి ఇన్‌స్టంట్‌గా రియాక్ట్ అయ్యే నెటిజన్స్, స్టోరీ బిగ్ పిక్చర్‌ని మిస్ చేస్తున్నారని ఆమె పాయింట్ అవుట్ చేసింది. "ట్రైలర్‌ని చూసి ఇన్స్టంట్ జడ్జ్మెంట్స్ చేయడం ఈజీ, కానీ అది టోటల్ మిస్అండర్స్టాండింగ్," అని ఆమె వివరించింది. ఫుల్ మూవీ రిలీజ్ అయ్యే వరకు వెయిట్ చేయమని, అప్పుడు స్టోరీ డెప్త్, ఆ సీన్ యొక్క ఇంపాక్ట్ క్లియర్ అవుతాయని ఆమె ఆడియన్స్‌ని రిక్వెస్ట్ చేసింది. ఆన్లైన్లో జరిగిన హంగామా, కామెంట్స్‌కి ఆమె చిల్డ్ రెస్పాన్స్ ఒక సాలిడ్ కౌంటర్‌గా నిలిచింది.
-
Home
-
Menu