తెలుగులో హిట్.. తమిళంలో ఫ్లాప్!

తెలుగులో హిట్.. తమిళంలో ఫ్లాప్!
X
శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ధనుష్, నాగార్జున కలిసి నటించిన పాన్ ఇండియా మూవీ ‘కుబేర’ తెలుగు రాష్ట్రాల్లో మంచి వసూళ్లు సాధిస్తోంది. విడుదలైన వారం రోజుల్లోనే రూ.100 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేయగా, థియేటర్లలో ఇప్పటికీ హౌస్‌ఫుల్ షోలు కొనసాగుతున్నాయి.

శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ధనుష్, నాగార్జున కలిసి నటించిన పాన్ ఇండియా మూవీ ‘కుబేర’ తెలుగు రాష్ట్రాల్లో మంచి వసూళ్లు సాధిస్తోంది. విడుదలైన వారం రోజుల్లోనే రూ.100 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేయగా, థియేటర్లలో ఇప్పటికీ హౌస్‌ఫుల్ షోలు కొనసాగుతున్నాయి. 'కన్నప్ప' వంటి మల్టీస్టారర్ సినిమా పోటీలో ఉన్నా సరే, తెలుగు ఆడియెన్స్ నుంచి గట్టి రెస్పాన్స్ వస్తోంది.

అయితే అదే సమయంలో ఈ సినిమా తమిళనాట పరాజయం పాలవుతోంది. కోలీవుడ్ ట్రేడ్ సమాచారం ప్రకారం తమిళనాడు మొత్తం కలెక్షన్లు రూ.20 కోట్ల లోపే ఉన్నాయి. ధనుష్ సినిమాకు ఇది ఆశించిన స్థాయిలోనూ లేదనే చెప్పాలి. ఈ తేడాకు ప్రధాన కారణం తమిళ ప్రేక్షకుల మైండ్‌సెట్‌ అంటున్నారు విశ్లేషకులు.

ధనుష్ నటించినా.. తెలుగు దర్శకుడు, తెలుగు సాంకేతిక బృందంతో సినిమా రావడంతో, దీనిని తమిళ జనాలు డబ్బింగ్ సినిమా అనుకుని పక్కనపెట్టారు. తమిళ నాట ప్రాంతీయతకు ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. అలాగే శేఖర్ కమ్ముల కథన శైలి కూడా తమిళ ప్రేక్షకులకు బాగా కనెక్ట్ కాలేదు. దేవా పాత్రలో హీరోయిజం తగ్గించడం, నాగార్జునకు సమాన ప్రాధాన్యం ఇవ్వడం వంటి అంశాలు తమిళ ఫ్యాన్స్‌కు నచ్చలేదు.

మరోవైపు తెలుగు ప్రేక్షకులు మాత్రం భాష, ప్రాంతం అనే బేధాలు లేకుండా, సినిమాకే ప్రాధాన్యత ఇచ్చారు. గతంలోనూ ఎన్నో తమిళ డబ్బింగ్ సినిమాలు తెలుగులో సూపర్ హిట్స్ అయిన సందర్భాలు చాలా ఉన్నాయి. ‘కుబేర’తో మరోసారి తెలుగు ఆడియెన్స్ బ్రాండ్ మైండ్ నేచర్ స్పష్టంగా కనిపించింది.

Tags

Next Story