'హిట్ 3' టీజర్ హిట్టింగ్ డేట్ లాక్డ్!

సినిమా సినిమాకి కథల ఎంపికలో విలక్షణతను చాటుతూ దూసుకెళ్తుంటాడు నాని. ఒకవైపు హీరోగా దుమ్మురేపుతూనే నిర్మాతగానూ 'హిట్' వంటి సూపర్ హిట్ సిరీస్ ను అందించాడు. ఇప్పుడు 'హిట్' సిరీస్ లోకి తానే హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఈ సిరీస్ లో థర్డ్ ఇన్‌స్టాల్‌మెంట్ గా రాబోతుంది 'హిట్ 3'.
శైలేష్ కొలను దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం బ్రూటల్ యాక్షన్ థ్రిల్లర్‌గా, హై టెక్నికల్ వేల్యూస్ తో సిద్ధమవుతోంది. ఈ సినిమాలో అర్జున్ సర్కార్ గా పోలీస్ పాత్రలో నాని మాస్ ప్రెజెన్స్ ఆడియన్స్ ను మెస్మరైజ్ చేయనుందట. మే 1న విడుదలకు ముస్తాబవుతోన్న 'హిట్ 3' టీజర్ కి డేట్ ఫిక్సయ్యింది.
ఫిబ్రవరి 24న 'హిట్ 3' టీజర్ రిలీజ్ కాబోతుంది. అందుకు సంబంధించి ఓ స్పెసల్ అనౌన్స్‌మెంట్ పోస్టర్ రిలీజ్ చేసింది టీమ్. ఈ పోస్టర్ లో గొడ్డలి పట్టుకుని ఊర మాస్ లుక్ లో కనిపిస్తున్నాడు నేచురల్ స్టార్. ఈ సినిమాలో నానికి జోడీగా శ్రీనిధి శెట్టి నటిస్తుంది.
-
Home
-
Menu