వంద కోట్ల క్లబ్ లో ‘హిట్ 3‘

వంద కోట్ల క్లబ్ లో ‘హిట్ 3‘
X
నాని నటించిన ‘హిట్ 3‘ బాక్సాఫీస్ ను షేక్ చేస్తుంది. విడుదలైన నాలుగు రోజుల్లోనే వరల్డ్ వైడ్ గా రూ.100 కోట్లు వసూళ్లను కొల్లగొట్టింది.

నాని నటించిన ‘హిట్ 3‘ బాక్సాఫీస్ ను షేక్ చేస్తుంది. విడుదలైన నాలుగు రోజుల్లోనే వరల్డ్ వైడ్ గా రూ.100 కోట్లు వసూళ్లను కొల్లగొట్టింది. నాని కెరీర్ లో ‘దసరా‘ తర్వాత మరోసారి వంద కోట్ల క్లబ్ లోకి ఎంటరైన చిత్రంగా నిలిచింది.

తొలి రోజు రూ.43 కోట్లు వసూళ్లు సాధించిన ఈ చిత్రం.. రెండు రోజులకు రూ.62 కోట్లు, మూడు రోజులకు రూ.82 కోట్లు సాధించిన ఈ చిత్రం.. ఇప్పుడు నాలుగు రోజులకు ప్రపంచవ్యాప్తంగా రూ.101 కోట్లు కొల్లగొట్టింది. మరోవైపు అమెరికాలో 2 మిలియన్ డాలర్లు కొల్లగొట్టిన ఈ చిత్రం.. టికెట్ బుకింగ్ ప్లాట్ ఫామ్ బుక్ మై షో లో 1 మిలియన్ టికెట్స్ సేల్ అయ్యి మరో అరుదైన రికార్డును సాధించింది.

వాల్ పోస్టర్ సినిమాస్ పై నాని సమర్పణలో ప్రశాంతి త్రిపురనేని ఈ చిత్రాన్ని నిర్మించారు. ‘హిట్‘ సిరీస్ డైరెక్టర్ శైలేష్ కొలను ఈ చిత్రాన్ని మరింత రస్టిక్ గా తీర్చిదిద్ది భారీ విజయాన్ని అందుకున్నాడు. మొత్తంగా.. లాంగ్ రన్ లో ‘హిట్ 3‘ ఎలాంటి వసూళ్లు సాధిస్తుందో చూడాలి.



Tags

Next Story