కమ్‌బ్యాక్ కోసం ఎదురు చూపులు!

ప్రస్తుతం టాలీవుడ్ లో కొత్త తరం భామల హవా పెరిగింది. అయితే వీరిలో ఎక్కువ మంది ఇప్పుడు మంచి కమ్‌బ్యాక్ కోసం ఎదురు చూస్తున్నారు. ఈ లిస్టులో ముందుగా చెప్పుకోవాల్సింది శ్రీలీల.
'భగవంత్ కేసరి' వంటి భారీ విజయం తర్వాత శ్రీలీలకు హీరోయిన్ గా హిట్స్ రాలేదు. ఆ తర్వాత చేసిన 'ఆదికేశవ, ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్, గుంటూరు కారం' నిరాశపరిచాయి. అయితే మధ్యలో 'పుష్ప 2'లో కిస్సిక్ సాంగ్ లో మెరిసి ఆడియన్స్ ను మెప్పించింది. ప్రస్తుతం 'రాబిన్‌హుడ్'తో కథానాయికగా విజయం కోసం ఎదురు చూస్తుంది శ్రీలీల.
మార్చి 28న 'రాబిన్‌హుడ్' వస్తోంది. 'రాబిన్‌హుడ్' తర్వాత శ్రీలీల లైనప్ మామూలుగా లేదు. తెలుగులో రవితేజ 'మాస్‌రాజా', అఖిల్ సినిమాలు లైన్లో ఉన్నాయి. తమిళంలో శివకార్తికేయన్ 'పరాశక్తి'తో పాటు హిందీలో కార్తిక్ ఆర్యన్ తో ‘ఆషికీ 3' సినిమాలున్నాయి.
‘మిస్టర్ బచ్చన్’ చిత్రంతో టాలీవుడ్ సర్కిల్స్ లో హాట్ టాపిక్‌గా మారిన బ్యూటీ భాగ్యశ్రీ బోర్సే. తొలి సినిమా 'మిస్టర్ బచ్చన్' నిరాశపరిచినా ఈ అమ్మడి కిట్టీలో పలు క్రేజీ మూవీస్ ఉన్నాయి. ప్రస్తుతం భాగ్యశ్రీ విజయ్ దేవరకొండ ‘కింగ్ డమ్’, రామ్ 22, దుల్కర్ సల్మాన్ ‘కాంతా’ సినిమాలలో నటిస్తుంది. ఈ సినిమాలతో తనకు టాలీవుడ్ లో స్టార్ స్టేటస్ దక్కుతుందని భావిస్తుంది భాగ్యశ్రీ.
‘కేజీయఫ్’ తర్వాత శ్రీనిధి శెట్టి పేరు మార్మోగిపోయింది. కానీ ఆ తర్వాత ఆమె నటించిన విక్రమ్ 'కోబ్రా' ఏమాత్రం ఆకట్టుకోలేకపోయింది. ప్రస్తుతం నాని ‘హిట్ 3’లో హీరోయిన్ గా నటిస్తుంది. అలాగే సిద్ధు జొన్నలగడ్డ 'తెలుగు కదా' సినిమాలోనూ నటిస్తుంది. ఈ రెండు చిత్రాలపైనా మంచి బజ్ ఉంది.
టాలీవుడ్ లో రెండు భారీ పాన్ ఇండియా సినిమాలతో బిజీగా ఉన్న బ్యూటీ నిధి అగర్వాల్. పవన్ కళ్యాణ్ తో 'హరిహర వీరమల్లు', ప్రభాస్ తో 'రాజా సాబ్' సినిమాలలో నాయికగా నటిస్తుంది నిధి అగర్వాల్. 'హరిహర వీరమల్లు' మే 9న వస్తుంటే.. 'రాజా సాబ్' రిలీజ్ డేట్ పై త్వరలోనే క్లారిటీ రానుంది. ఈ రెండు సినిమాలూ తనకు మంచి విజయాలను అందిస్తాయని నమ్ముతుంది నిధి.
మొత్తంగా ఈ యంగ్ బ్యూటీస్ అందరూ తమ కెరీర్‌ను కొత్త వెలుగుల్లో నిలబెట్టుకునే ప్రయత్నంలో ఉన్నారు. మరి.. వీరి కమ్‌బ్యాక్ ఎఫెక్ట్ ఎలా ఉంటుందనేది ఇక ప్రేక్షకుల తీర్పుపై ఆధారపడి ఉంటుంది.
-
Home
-
Menu