పూరి-విజయ్ కాంబో పై వేడి చర్చ

పూరి-విజయ్ కాంబో పై వేడి చర్చ
X
టాలీవుడ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ టాలెంట్ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించాల్సిన అవసరం లేదు. టాలీవుడ్ లో చాలామంది స్టార్స్ కు మాస్ ఇమేజ్ ను తీసుకొచ్చిన క్రెడిట్ పూరి జగన్నాథ్ దే. హీరోల డైలాగ్ డెలివరీ, బాడీ లాంగ్వేజ్ ను పూర్తిగా మార్చేయగల సత్తా ఉన్న డైరెక్టర్ పూరి.

టాలీవుడ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ టాలెంట్ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించాల్సిన అవసరం లేదు. టాలీవుడ్ లో చాలామంది స్టార్స్ కు మాస్ ఇమేజ్ ను తీసుకొచ్చిన క్రెడిట్ పూరి జగన్నాథ్ దే. హీరోల డైలాగ్ డెలివరీ, బాడీ లాంగ్వేజ్ ను పూర్తిగా మార్చేయగల సత్తా ఉన్న డైరెక్టర్ పూరి. అయితే.. ప్రస్తుతం పూరి వరుస పరాజయాలతో సతమతమవుతున్నాడు. పూరి నుంచి వచ్చిన ‘లైగర్, డబుల్ ఇస్మార్ట్‘ డిజాస్టర్స్ గా మిగిలాయి.

ఇక ఉగాది కానుకగా పూరి జగన్నాథ్ తన కొత్త సినిమాని తమిళ మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతితో చేయబోతున్నట్టు అనౌన్స్ చేశాడు. పూరి కనెక్ట్స్ బ్యానర్ పై ఈ చిత్రం రూపొందనుంది. జూన్‌ నుంచి ఈ మూవీ షూటింగ్ మొదలవుతుంది.

మరోవైపు ‘మహారాజా’ విజయం తర్వాత చాలామంది దర్శకుల నుంచి ఆఫర్లు వస్తున్నా.. విజయ్ సేతుపతి ఏరికోరి పూరి జగన్నాథ్ తో సినిమా చేయడానికి ముందుకొచ్చాడు. దీంతో.. ఫ్లాపుల్లో ఉన్న పూరి జగన్నాథ్ తో సినిమా వద్దు అంటూ సేతుపతికి హితవు పలుకుతూ ఓ నెటిజన్లు ఈ కాంబోని ట్రోల్ చేశాడు.

ఈ ట్రోల్ పై తమిళ నటుడు శాంతను భాగ్యరాజ్ తీవ్రంగా స్పందించాడు. ‘ఇండస్ట్రీలో వ్యక్తుల గురించి అలా మాట్లాడకండి. సోషల్‌ మీడియాలో పోస్ట్‌ పెట్టేటప్పుడు సరైన పదాలు వాడడం నేర్చుకోండి. ఆయన ఓ ప్రముఖ దర్శకుడు. ఆయనకు గౌరవం ఇవ్వండి.‘ అంటూ ట్రోలర్స్ కి గట్టిగా సమాధానం చెప్పాడు. అసలు పూరి-విజయ్ సేతుపతి కాంబోతో శాంతనుకి సంబంధం లేకపోయినా.. ఓ ఇండస్ట్రీ వ్యక్తిగా ఆయన స్పందించిన తీరుని మరికొంతమంది నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.

https://x.com/imKBRshanthnu/status/1906423332129693696

Tags

Next Story