‘నేను రెడీ‘ అంటోన్న హవీష్!

‘నేను రెడీ‘ అంటోన్న హవీష్!
X
బిజినెస్ కుటుంబం నుంచి వచ్చి చిత్ర పరిశ్రమలో సత్తా చాటుతున్నాడు యంగ్ హీరో హవీష్. ‘నువ్విలా‘ సినిమాతో పరిచయమైన హవీష్.. హీరోగా ప్రయోగాలకు పెద్ద పీట వేస్తూ వస్తున్నాడు.

బిజినెస్ కుటుంబం నుంచి వచ్చి చిత్ర పరిశ్రమలో సత్తా చాటుతున్నాడు యంగ్ హీరో హవీష్. ‘నువ్విలా‘ సినిమాతో పరిచయమైన హవీష్.. హీరోగా ప్రయోగాలకు పెద్ద పీట వేస్తూ వస్తున్నాడు. ‘రామ్ లీలా, జీనియస్, 7 - సెవెన్‘ వంటి విభిన్న కథాంశాలతో నటుడిగా తనను తాను నిరూపించుకున్నాడు.

హీరోగానే కాకుండా నిర్మాతగానూ హవీష్ తన సత్తా చాటుతున్నాడు. బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన ‘రాక్షసుడు‘ సినిమాను హవీష్ నే నిర్మించాడు. ఈ సినిమా మంచి ఫలితాన్ని అందుకుంది. ఇక దీని తరువాత రవితేజ హీరోగా నటించిన ‘ఖిలాడీ‘ సినిమాను నిర్మించాడు.

యువతతో పాటు అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించే లక్ష్యంతో ఇప్పుడు కుటుంబ, వినోదాత్మక, ప్రేమకథతో కూడిన మంచి సినిమా చేయాలన్న సంకల్పంతో ‘నేను రెడీ‘ అంటూ వస్తున్నాడు హవీష్. ‘ధమాకా‘ ఫేమ్ నక్కిన త్రినాథరావు డైరెక్షన్ లో ఈ సినిమా రూపొందుతుంది. ఈరోజు హవీష్ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఈ యంగ్ హీరోకి బర్త్ డే విషెస్ తెలియజేస్తుంది తెలుగు 70MM.

Tags

Next Story