ఓటీటీలోకి 'హరిహర వీరమల్లు'

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా, క్రిష్–జ్యోతికృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన హిస్టారికల్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘హరి హర వీరమల్లు’. ఏఎం రత్నం నిర్మించిన ఈ చిత్రం జూలై 24న పాన్ ఇండియా స్థాయిలో విడుదలైంది. అయితే.. ఎన్నో అంచనాలతో వచ్చిన ఈ సినిమా థియేట్రికల్ గా మిక్స్డ్ రెస్పాన్స్ దక్కించుకుంది.
లేటెస్ట్ గా 'వీరమల్లు' ఓటీటీలోకి వచ్చేస్తుంది. విడుదలై నెల రోజుల కాకముందే డిజిటల్ స్ట్రీమింగ్ కి రెడీ అయ్యింది. రేపటి (ఆగస్టు 20) నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కాబోతుంది. ప్రస్తుతం ఈ చిత్రం తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో అందుబాటులోకి వస్తుండగా, హిందీ వెర్షన్ మాత్రం మరో నెల తర్వాత వచ్చే అవకాశముంది.
థియేటర్లలో ఈ మూవీ ఐదు భాషల్లో విడుదలైనప్పటికీ బాక్సాఫీస్ వద్ద అనుకున్న స్థాయిలో విజయాన్ని అందుకోలేకపోయింది. వీక్ రైటింగ్, వీఎఫ్ఎక్స్ కారణంగా సినిమా పెద్దగా ఇంప్రెస్ చేయలేదనే మాట వినిపించింది. అయినప్పటికీ పవన్ కళ్యాణ్ పవర్‌ఫుల్ స్క్రీన్ ప్రెజెన్స్ అభిమానులను ఆకట్టుకుంది. థియేటర్లలో మిశ్రమ స్పందన తెచ్చుకున్న ‘హరి హర వీరమల్లు’ ఇప్పుడు ఓటీటీలో ఏ విధమైన రెస్పాన్స్ అందుకుంటుందో చూడాలి.
-
Home
-
Menu