హరి హర వీరమల్లు వాయిదా!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో రూపొందుతున్న హరి హర వీరమల్లు చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా ఈ చిత్రం విడుదల తేదీపై పెరుగుతున్న ఊహాగానాల మధ్య చిత్రబృందం ఓ అధికారిక ప్రకటన విడుదల చేసింది.
HARI HARA VEERA MALLU - A Step Back for Bigger Strides Ahead - Official Statement on Release Date.
— L.VENUGOPAL🌞 (@venupro) June 6, 2025
Hari Hara Veera Mallu continues to be one of the most eagerly awaited cinematic spectacles across the globe. With growing speculation about the film’s release, the makers have… pic.twitter.com/BJtpvJAUxh
జూన్ 12న విడుదల చేయాలన్న ప్రయత్నాలు పూర్తి స్థాయిలో చేసినా, కొన్ని కారణాల వల్ల ఆ తేదీకి సినిమాను విడుదల చేయడం సాధ్యపడడం లేదని స్పష్టం చేశారు మేకర్స్. ఈ నిర్ణయం కేవలం సినిమాను అద్భుతంగా తీర్చిదిద్దే ప్రయత్నంలో భాగమేనన్నారు. ‘ఇంకొంచెం సమయం మాకు ఇవ్వండి, కానీ మేము చూపించబోయే విషయం మాత్రం అసాధారణం అవుతుంది’ అని భావోద్వేగంగా చెప్పారు.
పలు వదంతులు, అపోహల నేపథ్యంలో అధికారిక సోషల్ మీడియా హ్యాండిల్స్ నుంచే సమాచారం నమ్మాలని స్పష్టం చేశారు మేకర్స్. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. త్వరలో ట్రైలర్ విడుదల చేసి రిలీజ్ డేట్ పైనా క్లారిటీ ఇవ్వనున్నారట.
-
Home
-
Menu