‘గూఢచారి 2‘ రిలీజ్ డేట్ ఫిక్స్

‘గూఢచారి 2‘ రిలీజ్ డేట్ ఫిక్స్
X
ఈతరం తెలుగు కథానాయకుల్లో థ్రిల్లర్ మూవీస్ కి స్పెషల్ క్రేజ్ తీసుకొచ్చాడు అడవి శేష్. ఈ యంగ్ హీరో నటించిన ‘గూఢచారి‘ మంచి విజయాన్ని సాధించింది.

ఈతరం తెలుగు కథానాయకుల్లో థ్రిల్లర్ మూవీస్ కి స్పెషల్ క్రేజ్ తీసుకొచ్చాడు అడవి శేష్. ఈ యంగ్ హీరో నటించిన ‘గూఢచారి‘ మంచి విజయాన్ని సాధించింది. ఈ సినిమాకి హీరో మాత్రమే కాదు రచయిత కూడా అతనే. 2018లో వచ్చిన ‘గూఢచారి‘ కేవలం రూ.6 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కి రూ. 25 కోట్లు వసూలు చేసింది. ఈ సినిమా హిందీ డబ్బింగ్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. యూట్యూబ్ లో ‘గూఢచారి‘ హిందీ అనువాదానికి వందల మిలియన్ల వ్యూస్ వచ్చాయి.

‘గూఢచారి‘ మూవీ చివరిలోనే సీక్వెల్ పై హింట్ ఇచ్చారు. మధ్యలో కోవిడ్ కారణంగా ‘గూఢచారి 2‘ పట్టాలెక్కడానికి ఎక్కువ సమయమే పట్టింది. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ‘గూఢచారి 2‘ రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకుంది. వచ్చే ఏడాది మే 1న ‘గూఢచారి 2‘ పాన్ ఇండియా రిలీజ్ కు రెడీ అవుతుంది. ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ ఇమ్రాన్ హష్మీ కీలక పాత్రలో కనిపించబోతున్నాడు. వామిక గబ్బీ హీరోయిన్ గా నటిస్తుంది.

‘గూఢచారి‘ సినిమాకి దర్శకత్వ శాఖలోనూ, ఎడిటింగ్ శాఖలోనూ పనిచేసిన వినయ్ కుమార్ సిరిగినీడి ‘గూఢచారి 2‘కి దర్శకత్వం వహిస్తున్నాడు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్, ఎ.కె. ఎంటర్ టైన్ మెంట్స్ వంటి సంస్థలు సంయుక్తంగా భారీ బడ్జెట్ తో ఈ సినిమాని నిర్మిస్తున్నాయి.



Tags

Next Story