తమిళ రీమేక్‌కి గ్రీన్ సిగ్నల్!

తమిళ రీమేక్‌కి గ్రీన్ సిగ్నల్!
X
టాలీవుడ్ కింగ్ నాగార్జున తన కెరీర్‌లో కీలక మైలురాయిగా నిలిచే వందో చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. తమిళ దర్శకుడు రా. కార్తీక్ చెప్పిన ఆసక్తికరమైన కథను నాగ్ ఓకే చేశాడు.

టాలీవుడ్ కింగ్ నాగార్జున తన కెరీర్‌లో కీలక మైలురాయిగా నిలిచే వందో చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. తమిళ దర్శకుడు రా. కార్తీక్ చెప్పిన ఆసక్తికరమైన కథను నాగ్ ఓకే చేశాడు. ఈ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్‌ను అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్‌పై నిర్మించనున్నారు. ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ పనులు శరవేగంగా సాగుతున్నాయి.

మరోవైపు నాగార్జున తమిళ హిట్ మూవీ ‘అయోతి’ రీమేక్‌కి కూడా సన్నద్ధమవుతున్నాడట. శశికుమార్ ప్రధాన పాత్రలో నటించిన ఈ మెలోడ్రామాటిక్ ఫిల్మ్ 2023లో విడుదలై విమర్శకుల ప్రశంసలు, కమర్షియల్ సక్సెస్‌ను సొంతం చేసుకుంది. దీనిని తెలుగులో రీమేక్ చేసేందుకు ట్రిడెంట్ ఆర్ట్స్ ముందుకు వచ్చినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ ప్రాజెక్టుపై చర్చలు జరగుతున్నాయి.

మొత్తానికి తన వందో చిత్రం, ఆ తర్వాత చేయబోయే సినిమా రెండూ తమిళ దర్శకులతోనే చేయనుండటం విశేషం. ఈ రెండు సినిమాలకు సంబంధించిన అఫీషియల్ అప్డేట్స్ నాగార్జున పుట్టినరోజైన ఆగస్టు 29న రానున్నాయట. ఇక ఆగస్టు 14న నాగార్జున కీలక పాత్రలో నటించిన 'కూలీ' వరల్డ్ వైడ్ గా రిలీజ్ కు రెడీ అవుతుంది.

Tags

Next Story