గోపీచంద్ కొత్త చిత్రం ముహూర్తం!

గోపీచంద్ కొత్త చిత్రం ముహూర్తం!
X
మ్యాచో స్టార్ గోపీచంద్.. శ్రీను వైట్లతో చేసిన ‘విశ్వం‘ ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. దీంతో ఇప్పుడు మంచి హిట్ కోసం ఎదురు చూస్తున్నాడు.

మ్యాచో స్టార్ గోపీచంద్.. శ్రీను వైట్లతో చేసిన ‘విశ్వం‘ ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. దీంతో ఇప్పుడు మంచి హిట్ కోసం ఎదురు చూస్తున్నాడు. ఈకోవలో ఇప్పటికే ‘ఘాజీ‘ ఫేమ్ సంకల్ప్ రెడ్డి డైరెక్షన్ లో ఒక సినిమాని పట్టాలెక్కించాడు. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై ఈ చిత్రం రూపొందుతుంది.

లేటెస్ట్ గా మరో కొత్త చిత్రానికి శ్రీకారం చుట్టాడు గోపీచంద్. సీనియర్ ప్రొడ్యూసర్ బి.వి.ఎస్.ఎన్. ప్రసాద్ బ్యానర్ శ్రీవెంకటేశ్వర సినీ చిత్రలో ఈ చిత్రం రూపొందుతుంది. ఈ సినిమా ఈరోజు హైదరాబాద్ లో ముహూర్తాన్ని జరుపుకుంది.

ఈ సినిమాతో కుమార్ వెల్లంకి అనే కొత్త దర్శకుడు పరిచయమవుతున్నాడు. షామ్‌దత్ ఈ మూవీకి సినిమాటోగ్రాఫర్. ఇంకా.. ఈ చిత్రానికి సంబంధించి మిగతా కాస్ట్ అండ్ క్రూ వివరాలు తెలియాల్సి ఉంది. త్వరలోనే ఈ చిత్రం పట్టాలెక్కనుందట.



Tags

Next Story