గోపీచంద్ బర్త్ డే ట్రీట్!

గోపీచంద్ బర్త్ డే ట్రీట్!
X
మ్యాచో స్టార్ గోపీచంద్.. శ్రీను వైట్లతో చేసిన ‘విశ్వం‘ ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. దీంతో ఇప్పుడు మంచి హిట్ కోసం ఎదురు చూస్తున్నాడు. ఈకోవలోనే ‘ఘాజీ‘ ఫేమ్ సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు.

మ్యాచో స్టార్ గోపీచంద్.. శ్రీను వైట్లతో చేసిన ‘విశ్వం‘ ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. దీంతో ఇప్పుడు మంచి హిట్ కోసం ఎదురు చూస్తున్నాడు. ఈకోవలోనే ‘ఘాజీ‘ ఫేమ్ సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. ‘ఘాజీ’తో జాతీయ అవార్డు గెలుచుకున్న సంకల్ప్ రెడ్డి ‘అంతరిక్షం, ఐబీ 71’లతో తన ప్రతిభను నిరూపించుకున్నాడు.

వాస్తవ సంఘటనల ఆధారంగా సినిమాలు తెరకెక్కించడంలో దిట్ట సంకల్ప్ రెడ్డి. ఇప్పుడు గోపీచంద్ చిత్రాన్నీ పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ లో ఓ వాస్తవ సంఘటన ఆధారంగా తెరకెక్కిస్తున్నాడట. ఈ సినిమాని శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ నిర్మిస్తుంది. జూన్ 12న గోపీచంద్ బర్త్ డే స్పెషల్ గా ఈ మూవీ కాన్సెప్ట్ రివీల్ చేస్తూ ఓ గ్లింప్స్ రిలీజ్ చేయనున్నారట.

సంకల్ప్ రెడ్డి చిత్రంతో పాటు కుమార్ వెల్లంకి అనే కొత్త దర్శకుడితోనూ సినిమా చేస్తున్నాడు గోపీచంద్. ఈ సినిమాని సీనియర్ ప్రొడ్యూసర్ బి.వి.ఎస్.ఎన్. ప్రసాద్ నిర్మిస్తున్నారు. ఈ మూవీకి సంబంధించి కూడా గోపీచంద్ బర్త్ డే స్పెషల్ గా కొత్త అప్డేట్స్ వచ్చే అవకాశం ఉంది.

Tags

Next Story