తెలుగులోనూ ఊపేస్తోన్న ‘గోల్డెన్ స్పారో‘!

తెలుగులోనూ ఊపేస్తోన్న ‘గోల్డెన్ స్పారో‘!
X
విలక్షణ నటుడు ధనుష్ ఈమధ్య దర్శకుడిగానూ దూకుడు పెంచుతున్నాడు. ఇప్పటివరకూ ధనుష్ డైరెక్షన్ లో వచ్చిన ‘పవర్ పాండి, రాయన్‘ రెండు చిత్రాలు ఘన విజయాలు సాధించాయి. ఇప్పుడు ధనుష్ డైరెక్షన్ లో మూడో చిత్రంగా ‘జాబిలమ్మ నీకు అంత కోపమా‘ రాబోతుంది.

విలక్షణ నటుడు ధనుష్ ఈమధ్య దర్శకుడిగానూ దూకుడు పెంచుతున్నాడు. ఇప్పటివరకూ ధనుష్ డైరెక్షన్ లో వచ్చిన ‘పవర్ పాండి, రాయన్‘ రెండు చిత్రాలు ఘన విజయాలు సాధించాయి. ఇప్పుడు ధనుష్ డైరెక్షన్ లో మూడో చిత్రంగా రాబోతుంది 'నిలవుక్కు ఎన్మెల్‌ ఎన్నాడి కోబమ్‌ (నీక్)‘. ఈ సినిమాని తెలుగులో ‘జాబిలమ్మ నీకు అంత కోపమా‘ పేరుతో విడుదల చేస్తున్నారు.


ఈ మూవీలో ధనుష్ నటించలేదు. పవీష్, అనిఖా సుఖేంద్రన్, ప్రియా ప్రకాష్ వారియర్ ప్రధాన పాత్రలు పోషించారు. ఇక ఈ మూవీలో జి.వి.ప్రకాష్ కుమార్ కంపోజ్ చేసిన ‘గోల్డెన్ స్పారో‘ సాంగ్ ఇప్పటికే తమిళనాట ఓ ఊపు ఊపేసింది. ఈ పాట యూట్యూబ్ లో మిలియన్ల వ్యూస్ ను కొల్లగొట్టింది. ఈ సాంగ్ లో హీరోయిన్ ప్రియాంక మోహన్ స్పెషల్ అప్పీరెన్స్ ఇవ్వడం విశేషం.


లేటెస్ట్ గా ‘గోల్డెన్ స్పారో‘ తెలుగు వెర్షన్ ను విడుదల చేశారు. తెలుగులోనూ ‘గోల్డెన్ స్పారో‘ సాంగ్ కి మంచి రెస్పాన్స్ దక్కుతుంది. ‘జాబిలమ్మ నీకు అంత కోపమా‘ చిత్రం ఫిబ్రవరి 21న విడుదలకు ముస్తాబవుతుంది.




Tags

Next Story