'గుడ్ బ్యాడ్ అగ్లీ' నుంచి త్రిష గ్లింప్స్!

X
కోలీవుడ్ స్టార్ అజిత్ ఈ ఏడాది 'గుడ్ బ్యాడ్ అగ్లీ' సినిమాతో రాబోతున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో అజిత్ కి జోడీగా త్రిష నటిస్తుంది. అధిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో రూపొందుతున్న 'గుడ్ బ్యాడ్ అగ్లీ' మూవీలో రమ్య పాత్రలో కనిపించబోతుంది త్రిష. లేటెస్ట్ గా ఈ మూవీ నుంచి త్రిష పాత్రకు సంబంధించిన గ్లింప్స్ రిలీజ్ చేశారు.
ఇటీవల విడుదలైన 'విడాముయార్చి'లోనూ అజిత్, త్రిష జంట కలిసి సందడి చేసింది. అయితే 'విడాముయార్చి' అజిత్ కి విజయాన్ని అందించలేకపోయింది. ఇక 'గుడ్ బ్యాడ్ అగ్లీ' సినిమా ఏప్రిల్ 10న విడుదల తేదీ ఖరారు చేసుకుంది. అయితే అదే రోజున ప్రభాస్ 'రాజా సాబ్' కూడా రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకుంది. ఫిల్మ్ సర్కిల్స్ లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం ఏప్రిల్ 10న 'రాజా సాబ్' రావడం లేదట. దీంతో అజిత్ 'గుడ్ బ్యాడ్ అగ్లీ'కి సోలో రిలీజ్ దొరికినట్టే.
Next Story
-
Home
-
Menu