'ఆకాశంలో ఒక తార' గ్లింప్స్

ఆకాశంలో ఒక తార గ్లింప్స్
X
మలయాళీ స్టార్ దుల్కర్ సల్మాన్.. తెలుగులోనూ మంచి పాపులారిటీ సంపాదించుకున్నాడు. 'మహానటి, సీతారామం, లక్కీ భాస్కర్' వంటి చిత్రాలతో ఇక్కడ ఘన విజయాలను సొంతం చేసుకున్నాడు.

మలయాళీ స్టార్ దుల్కర్ సల్మాన్.. తెలుగులోనూ మంచి పాపులారిటీ సంపాదించుకున్నాడు. 'మహానటి, సీతారామం, లక్కీ భాస్కర్' వంటి చిత్రాలతో ఇక్కడ ఘన విజయాలను సొంతం చేసుకున్నాడు. ఈనేపథ్యంలో.. ఇప్పుడు వరుసగా తెలుగు సినిమాలలో సందడి చేస్తున్నాడు ఈ మాలీవుడ్ స్టార్. ఈరోజు దుల్కర్ బర్త్‌డే స్పెషల్ గా 'కాంత' టీజర్ తో పాటు.. మరో చిత్రం 'ఆకాశంలో ఒక తార' గ్లింప్స్ కూడా రిలీజయ్యింది.

పవన్ సాదినేని దర్శకత్వంలో అగ్ర నిర్మాణ సంస్థలు గీతా ఆర్ట్స్, స్వప్న సినిమాస్ సమర్పణలో లైట్ బాక్స్ బ్యానర్‌పై సందీప్ గుణ్ణం, రమ్యా గుణ్ణం ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. జీవీ ప్రకాశ్ సంగీతాన్ని సమకూరుస్తున్నాడు. ఈ గ్లింప్స్‌లో దుల్కర్‌ ఓ సాదాసీదా మధ్యతరగతి వ్యక్తిగా కనిపిస్తున్నాడు. ఈ సినిమాకి సంబంధించిన మిగతా నటీనటుల విషయంలను త్వరలో వెల్లడించనున్నారట. తెలుగుతో పాటు పాన్ ఇండియా లెవెల్ లో ఈ చిత్రం రాబోతుంది.

Tags

Next Story