దక్షిణాది నుంచి బాలీవుడ్ వరకు!

దక్షిణాది నుంచి బాలీవుడ్ వరకు!
X

సినిమా పరిశ్రమలో హీరోయిన్లను అందం, గ్లామర్ కోణంలోనే చూడటం సర్వసాధారణం. కానీ కొంతమంది నటీమణులు తమ ప్రతిభను ప్రధానంగా నిలబెట్టుకుంటూ ప్రేక్షకుల మనసు గెలుచుకుంటున్నారు. అలాంటి విశిష్టమైన కథానాయికల్లో సాయిపల్లవి ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకుంది.

సహజ నటన, భావోద్వేగ ప్రదర్శన ఆమెకు ప్రధాన బలాలు. కుటుంబ ప్రేక్షకులు ఆమెను కేవలం హీరోయిన్ గా కాకుండా, తమ ఇంటి అమ్మాయిగా భావిస్తారు. ఆమె పాత్రలు నేటివిటీకి దగ్గరగా ఉండటమే ఇందుకు ప్రధాన కారణం. నటన మాత్రమే కాకుండా, డాన్స్‌లోనూ ఆమెకు ప్రత్యేక గుర్తింపు ఉంది.

పేరుకు తమిళ అమ్మాయి అయినా మలయాళంలో హీరోయిన్ గా తొలి విజయాన్నందుకుంది. ఆ తర్వాత తెలుగులో స్టార్ స్టేటస్ దక్కించుకున్న సాయి పల్లవి.. మాతృ భాష తమిళంలోనూ ఘన విజయాలు అందుకుంది. ఇప్పుడు హిందీలో సైతం విజయకేతనం ఎగురవేయడానికి సిద్ధమవుతుంది.

'అమరన్, తండేల్' వంటి వరుస సూపర్ హిట్స్ తర్వాత సాయి పల్లవి ఇప్పుడు రెండు హిందీ చిత్రాల్లో నటిస్తుంది. వీటిలో 'ఏక్ దిన్' ఒకటి కాగా 'రామాయణ' సిరీస్ మరొకటి. 'రామాయణ'లో సీత పాత్రలో కనిపించబోతుంది సాయి పల్లవి. రెండు భాగాలుగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. మరోవైపు.. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ నుంచి కూడా సాయి పల్లవికి మరిన్ని క్రేజీ ప్రాజెక్ట్స్ క్యూ కడుతున్నాయట.

Tags

Next Story