జర్నలిస్టు నుంచి నిర్మాతగా

తెలుగు చిత్ర పరిశ్రమలో తనదైన ముద్ర వేస్తున్న యువ నిర్మాత ఎస్.కె.ఎన్.. 'బేబీ' వంటి బ్లాక్‌బస్టర్ తర్వాత ఎస్.కె.ఎన్. ప్రస్తుతం పలు ఆసక్తికరమైన ప్రాజెక్ట్స్ తో రాబోతున్నారు. ఈరోజు (జూలై 7) ఎస్.కె.ఎన్. పుట్టినరోజు.
మెగా ఫ్యామిలీకి వీరాభిమాని అయిన ఎస్.కె.ఎన్., మొదట జర్నలిజం, తర్వాత పీఆర్‌ఓగా కెరీర్ ప్రారంభించి, దర్శకుడు మారుతి ప్రోత్సాహంతో 'ఈ రోజుల్లో' సినిమా ద్వారా నిర్మాతగా మారారు. అక్కడి నుంచి వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరం రాలేదు.
తెలుగులో సంచలన విజయం సాధించిన 'బేబీ' సినిమాను ఇప్పుడు హిందీలోనూ రూపొందిస్తున్నారు. ప్రీ-ప్రొడక్షన్ దశలో ఉన్న ఈ చిత్రం త్వరలో షూటింగ్ మొదలుపెట్టుకోనుంది. ఈ ప్రాజెక్ట్ ఎస్.కె.ఎన్. ప్రొడక్షన్ సామర్థ్యాన్ని జాతీయ స్థాయిలో పరిచయం చేయబోతుంది.
మరోవైపు కిరణ్ అబ్బవరం హీరోగా 'చెన్నై లవ్ స్టోరీ' సెట్స్ పై ఉంది. ప్రభాస్ నటిస్తున్న 'ది రాజా సాబ్' చిత్రానికి క్రియేటివ్ ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారు. ఇంకా.. నిర్మాతగా మరికొన్ని ప్రాజెక్ట్స్ ను లైన్లో పెట్టిన ఎస్.కె.ఎన్.కు బర్త్ డే విషెస్ తెలియజేస్తుంది తెలుగు 70 ఎమ్.ఎమ్.
-
Home
-
Menu