రేపటి బాక్సాఫీస్ బరిలో నాలుగు సినిమాలు!

రేపటి బాక్సాఫీస్ బరిలో నాలుగు సినిమాలు!
X

రేపటి బాక్సాఫీస్ బరిలో నాలుగు సినిమాలు!ప్రతీ వారం కొత్త సినిమాలతో టాలీవుడ్ బాక్సాఫీస్ కళకళలాడుతోంది. ఈ వారం కూడా పలు కొత్త సినిమాలు బాక్సాఫీస్ కి క్యూ కడుతున్నాయి. రేపటి సినిమాల జాబితాలో స్ట్రెయిట్ మూవీస్ రెండు ఉంటే.. అనువాద రూపంలో మరో రెండు సినిమాలున్నాయి.

ధన్‌రాజ్ దర్శకత్వం వహించిన ‘రామం రాఘవం’ రేపు విడుదలవుతోంది. సముద్రఖని, ధన్‌రాజ్ తండ్రీకొడుకులుగా నటించిన చిత్రమిది. ఫాదర్ అండ్ సన్ రిలేషన్ ను ఈ సినిమాలో కొత్తగా ఆవిష్కరించానంటున్నాడు ధనరాజ్. ‘బలగం’తో వేణు దర్శకుడిగా తన ముద్ర వేశాడు. ఇప్పుడు మరో జబర్దస్త్ స్టార్ ధన్‌రాజ్ ఈ సినిమాతో దర్శకుడిగా హిట్ కొడతానంటున్నాడు.

బ్రహ్మాజీ, అవసరాల శ్రీనివాస్, ధన్య బాలకృష్ణ ప్రధాన పాత్రలు పోషించిన 'బాపు' కూడా రేపటి విడుదల జాబితాలో ఉంది. ఈ సినిమాకి పారితోషికం తీసుకోకుండా నటించానంటూ బ్రహ్మాజీ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు. ఈ సినిమా కూడా తండ్రీ కొడుకుల అనుబంధాన్ని హైలైట్ చేయబోతున్నట్టు తెలుస్తోంది. అలాగే తెలంగాణ ప్రాంత నేపథ్యాన్ని ఈ సినిమాలో ఎంతో సహజంగా తీర్చిదిద్దినట్టు ప్రచార చిత్రాలు చూస్తే అర్థమవుతుంది.

తమిళం నుంచి రేపు బాక్సాఫీస్ వద్ద సందడి చేయబోతున్న చిత్రం ‘జాబిలమ్మ నీకు అంత కోపమా’. విలక్షణ నటుడు ధనుష్ డైరెక్షన్ లో రూపొందిన సినిమా ఇది. ఎక్కువగా కొత్త వాళ్లతో రూపొందిన ఈ సినిమా టైటిల్ క్యాచీగా ఉంది. ఈ సినిమా నుంచి టీజర్, ట్రైలర్, గోల్డెన్ స్పారో సాంగ్స్ ఇప్పటికే మెప్పించాయి.

‘లవ్ టుడే’ సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న ప్రదీప్ రంగనాథన్ తాజా చిత్రం ‘రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్’. ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్ కథానాయికగా నటించింది. 'లవ్‌టుడే' తరహాలో యూత్‌ను టార్గెట్ చేస్తూ రూపొందిన రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌ ఇది. ఈ సినిమాపైనా తెలుగులో మంచి అంచనాలున్నాయి.

Tags

Next Story