'తమ్ముడు' నుంచి ‘భూ అంటూ భూతం’!

X
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన సూపర్ హిట్ మూవీస్ లో 'తమ్ముడు' ఒకటి. ఇప్పుడు అదే టైటిల్ తో పవన్ అభిమాని నితిన్ సినిమా చేస్తున్నాడు.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన సూపర్ హిట్ మూవీస్ లో 'తమ్ముడు' ఒకటి. ఇప్పుడు అదే టైటిల్ తో పవన్ అభిమాని నితిన్ సినిమా చేస్తున్నాడు. స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మాణంలో వేణు శ్రీరామ్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం జూలై 4న విడుదలకు ముస్తాబవుతుంది. ఇటీవల విడుదలైన ట్రైలర్ తో 'తమ్ముడు'పై అంచనాలు ఆసక్తి పెరిగింది. ఇప్పుడు ఫస్ట్ సింగిల్ 'భూ అంటూ భూతం' రిలీజయ్యింది.
హీరో నితిన్ తన మేనకోడలకు ధైర్యం చెప్పే గీతంగా ఈ పాటను తీర్చిదిద్దాడు డైరెక్టర్. 'భూ అంటూ భూతం వస్తే ఆగకే అమ్మాడీ, ఛూ మంత్రం వేసి దాంతో బొమ్మలాటలాడాలి…' అంటూ మోటివేషనల్ గా ఈ పాటకు లిరిక్స్ అందించారు సింహాచలం. అజనీష్ లోకనాథ్ స్వరాలు అందించగా, అనురాగ్ కులకర్ణి, అక్షిత ఈ పాటను ఆలపించారు. మొత్తంగా అక్కాతమ్ముళ్ల అనుబంధం నేపథ్యంలో రాబోతున్న 'తమ్ముడు' మంచి విజయాన్ని సాధిస్తుందేమో చూడాలి.
Next Story
-
Home
-
Menu