'మిరాయ్' నుంచి ఫస్ట్ సింగిల్!

‘హనుమాన్’ సినిమాతో సంచలన విజయాన్ని అందుకున్న యంగ్ హీరో తేజ సజ్జా, ఇప్పుడు మరో పాన్ ఇండియా మూవీ ‘మిరాయ్’తో వస్తున్నాడు. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో తేజ ఓ యోధుడిగా కనిపించనుండగా, మంచు మనోజ్ ప్రతినాయకుడిగా నటిస్తున్నాడు. రితికా నాయక్ హీరోయిన్ కాగా.. శ్రియ, జయరామ్, జగపతిబాబు కీలక పాత్రలు పోషిస్తున్నారు.
ఇప్పటికే విడుదలైన టీజర్‌కు భారీ రెస్పాన్స్ రాగా, లేటెస్ట్ గా ఫస్ట్ సింగిల్ ‘వైబ్ ఉంది బేబీ’ వచ్చింది. ఈ సాంగ్ రిలీజైన వెంటనే యూట్యూబ్ లో దూసుకుపోతుంది. గౌర హరి మ్యూజిక్ లో కృష్ణకాంత్ రాసిన ఈ పాటను అర్మాన్ మాలిక్ ఆలపించాడు. హీరోహీరోయిన్లు తేజ, రితికా లపై చిత్రీకరించిన ఈ పాటకు పోలకి విజయ్ కొరియోగ్రఫీ బాగుంది.
పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టి.జి. విశ్వప్రసాద్ నిర్మిస్తున్న ఈ భారీ ప్రాజెక్ట్ సెప్టెంబరు 5న 2డీ, 3డీ ఫార్మాట్‌లలో మొత్తం 8 భాషల్లో గ్రాండ్‌గా విడుదల కాబోతోంది. బాలీవుడ్ బడా నిర్మాత కరణ్ జోహార్, ఈ చిత్రం హిందీ హక్కులను దక్కించుకోవడంతో ‘మిరాయ్’పై బాలీవుడ్‌లోనూ భారీ అంచనాలు ఉన్నాయి.
-
Home
-
Menu