సినీ కార్మికుల సమ్మె 17వ రోజు

సినీ కార్మికుల సమ్మె 17వ రోజు
X
టాలీవుడ్‌లో కొనసాగుతున్న సినీ కార్మికుల సమ్మె 17వ రోజుకు చేరుకుంది. ఈ రోజు ఉదయం 11 గంటలకు నిర్మాతలతో ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షులు, కార్యదర్శులు కీలక సమావేశం కానున్నారు.

టాలీవుడ్‌లో కొనసాగుతున్న సినీ కార్మికుల సమ్మె 17వ రోజుకు చేరుకుంది. ఈ రోజు ఉదయం 11 గంటలకు నిర్మాతలతో ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షులు, కార్యదర్శులు కీలక సమావేశం కానున్నారు. సాయంత్రం 4 గంటలకు ఫిల్మ్ ఛాంబర్ ప్రతినిధులు, ఫెడరేషన్ నాయకులతో మరో రౌండ్ చర్చలు జరపనున్నారు.

నిన్న మూడు గంటల పాటు సాగిన చర్చల్లో ఇరు వర్గాల మధ్య కొన్ని అంశాలపై చర్చలు జరిగినప్పటికీ, నిర్మాతలు పెట్టిన రెండు కండిషన్స్ కారణంగా ప్రతిష్టంభన ఏర్పడింది. అయితే నిర్మాతలు కార్మికుల వేతనాల శాతం పెంపు విషయంలో సానుకూలంగా స్పందించారని సమాచారం. డాన్సర్స్, ఫైటర్స్, టెక్నీషియన్స్ యూనియన్లకు కూడా వేతనాల్లో పెంపు చేస్తామని హామీ ఇచ్చినట్టు తెలుస్తోంది.

ఈరోజు సాయంత్రం జరగబోయే ఫెడరేషన్ – ఫిల్మ్ ఛాంబర్ చర్చల్లో తుది నిర్ణయం వెలువడే అవకాశాలు కనిపిస్తున్నాయి. అన్నీ అనుకూలంగా జరిగితే, గురువారం నుంచి యధావిధిగా షూటింగ్స్ పునఃప్రారంభం కావచ్చని సినీ వర్గాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి.

Tags

Next Story