కుటుంబ సమస్యలు: మంచు మనోజ్ ఆవేదన!

సినీ నటుడు మంచు మనోజ్ తన కుటుంబ సమస్యలు, తను ఎదుర్కొంటున్న అన్యాయాలను గురించి ఆవేదన వ్యక్తం చేశాడు. ఆయన తాజాగా తన అవ్వ తాతల సమాధులను సందర్శించి నివాళులు అర్పించాడు. ఈ సందర్బంగా, ఆయన కుటుంబంలో జరుగుతున్న పరిణామాలు, వ్యక్తిగత సమస్యలు, మరియు స్థానిక స్థాయిలో ఎదురవుతున్న సమస్యల గురించి మాట్లాడాడు.
మనోజ్ వెల్లడించిన ప్రకారం, కుటుంబంలో నిరంతరం గొడవలు జరుగుతున్నాయనీ, అవి ఎందుకు జరుగుతున్నాయో తనకు తెలియడం లేదని చెప్పాడు. హైదరాబాద్‌లోని తన ఇంట్లోకి రావడానికి కూడా నిరాకరించారని ఆరోపించాడు. తన తల్లిని బ్రెయిన్ వాష్ చేసి ఆమెతో సంతకాలు చేయించారని, అలాగే తన తల్లి పుట్టినరోజున తన ఇంటి జనరేటర్‌లో చక్కెర పోశారని అన్నాడు.
తన అభిమానులు కాలేజీ వద్ద ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను తొలగించడం, విద్యార్థులపై అన్యాయాలకు నిరసన తెలిపిన వారిని దూరం పెట్టడం వంటి ఘటనలు కూడా జరిగాయని తెలిపాడు. ఫ్లెక్సీలు తొలగించినా, అభిమానులు మళ్లీ వాటిని ఏర్పాటు చేస్తుండగా, స్థానిక బౌన్సర్లు, రౌడీలు వాటిని ట్రాక్టర్లతో తొలగించినట్లు మనోజ్ తెలిపాడు.
ట్రస్ట్ సభ్యులు బయట నుంచి రౌడీలను తీసుకొచ్చి గొడవలకు కారణమవుతున్నారని, పోలీసులు లాఠీలు పట్టుకొని ఉన్నా, పరిస్థితిని నియంత్రించలేకపోయారని మనోజ్ ఆవేదన వ్యక్తం చెప్పాడు. కొన్ని ఘటనల్లో రౌడీలు గోడలు దూకి పారిపోయారని ఆయన పేర్కొన్నాడు.
ఈ సంఘటనలపై పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేస్తానని, అన్యాయాలకు వ్యతిరేకంగా న్యాయపరమైన మార్గాలను అన్వేషిస్తానని మంచు మనోజ్ స్పష్టంచేశాడు.
-
Home
-
Menu