ఇండియాలో ‘F1’ రేసింగ్ స్పీడ్!

ఇండియాలో ‘F1’ రేసింగ్ స్పీడ్!
X
కంటెంట్ బాగుండాలే కానీ కలెక్షన్ల వర్షం కురిపించడంలో ఇండియన్ సినీ ప్రేక్షకులు ఎప్పుడూ ముందుంటారు. ఈకోవలోనే జూన్ 27న వరల్డ్ వైడ్ గా రిలీజైన హాలీవుడ్ మూవీ 'F1' ఇండియన్ బాక్సాఫీస్ వద్ద రూ.50 కోట్ల మైలురాయిని అందుకోబోతుంది.

హాలీవుడ్ సూపర్‌స్టార్ బ్రాడ్ పిట్ ప్రధాన పాత్రలో రేసింగ్ నేపథ్యంలో వచ్చిన ఈ చిత్రానికి మొదటి రోజు నుంచే పాజిటివ్ టాక్ వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా రూ.1200 కోట్లకు పైగా వసూళ్లను కొల్లగొట్టిన ఈ చిత్రం ఇండియాలో 9 రోజులకు రూ.43 కోట్లు వసూళ్లను సాధించింది. త్వరలో ఈ సినిమా రూ.50 కోట్లు మార్క్‌ను అందుకోబోతుంది.

తెలుగు, హిందీ, తమిళంతో పాటు ఇంగ్లీష్‌లో కూడా విడుదలైన ఈ సినిమా, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, ముంబై వంటి మెట్రో సిటీల్లో మంచి ఆక్యుపెన్సీని నమోదు చేస్తుంది. ఈ మూవీలో సన్నీ హేయస్ అనే రిటైర్డ్ F1 రేసర్ క్యారెక్టర్ లో బ్రాడ్ పిట్ నటనకు ఆడియన్స్ ఫిదా అవుతున్నారు.

Tags

Next Story