'ఈ నగరానికి ఏమైంది 2' స్క్రిప్ట్ లాక్డ్!

ఈ నగరానికి ఏమైంది 2 స్క్రిప్ట్ లాక్డ్!
X
మొదటి సినిమా 'పెళ్లి చూపులు'తోనే టాలీవుడ్‌ లో తనదైన గుర్తింపు తెచ్చుకున్నాడు తరుణ్ భాస్కర్. ఈ టాలెంటెడ్ డైరెక్టర్ తీసిన మరో చిత్రం 'ఈ నగరానికి ఏమైంది' యూత్ లో మంచి పేరు తెచ్చుకుంది.

మొదటి సినిమా 'పెళ్లి చూపులు'తోనే టాలీవుడ్‌ లో తనదైన గుర్తింపు తెచ్చుకున్నాడు తరుణ్ భాస్కర్. ఈ టాలెంటెడ్ డైరెక్టర్ తీసిన మరో చిత్రం 'ఈ నగరానికి ఏమైంది' యూత్ లో మంచి పేరు తెచ్చుకుంది. విశ్వక్ సేన్, అభినవ్ గోమటం, సుశాంత్ రెడ్డి, వెంకటేష్ కాకుమాను వంటి నటి నటులతో వచ్చిన ఈ చిత్రం ఓ కల్ట్ క్లాసిక్‌గా మారింది.

మొదటిసారి థియేటర్లలో విడుదలయ్యేప్పుడు పెద్దగా కలెక్షన్లు రాకపోయినా.. ఓటీటీలో మాత్రం ఈ మూవీకి భారీ క్రేజ్ వచ్చింది. రీ-రిలీజ్ లోనూ మంచి వసూళ్లను రాబట్టింది. ఇప్పుడు ఈ సినిమాకి కొనసాగింపుగా 'ఈ నగరానికి ఏమైంది 2' స్క్రిప్ట్‌ను తీర్చిదిద్దుతున్నాడు తరుణ్ భాస్కర్.

తాజాగా ఆయన తన లాప్‌టాప్ స్క్రీన్‌పై 'The End' అనే టైటిల్ కనిపించేలా ఫోటో తీసి షేర్ చేశాడు. దీంతో 'ఈ నగరానికి ఏమైంది 2' స్క్రిప్ట్ పూర్తయ్యిందనే సంకేతాన్ని మూవీ లవర్స్ తో పంచుకున్నాడు తరుణ్ భాస్కర్. విశ్వక్ సేన్ ప్రధాన పాత్రలో నటించే 'ఈ నగరానికి ఏమైంది 2' త్వరలో పట్టాలెక్కనుంది.



Tags

Next Story