దుల్కర్ 'ఐ యామ్ గేమ్' షూటింగ్ ప్రారంభం

దుల్కర్ ఐ యామ్ గేమ్ షూటింగ్ ప్రారంభం
X

దుల్కర్ 'ఐ యామ్ గేమ్' షూటింగ్ ప్రారంభంమలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ మళ్ళీ తన మాతృభాషలోకి తిరిగి వస్తున్నాడు. అతడి కొత్త చిత్రం "ఐయామ్ గేమ్", స్పోర్ట్స్ ఆధారిత యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతోంది. ఈ చిత్రాన్ని ఆర్‌డిఎక్స్ చిత్రంతో గుర్తింపు పొందిన దర్శకుడు నహాస్ హిదాయత్ తెరకెక్కిస్తున్నాడు.

తిరువనంతపురంలో తాజా గా జరిగిన పూజా కార్యక్రమంతో షూటింగ్ గ్రాండ్ గా ప్రారంభమైంది. ఈ వేడుకకు ప్రధాన నటులు ఆంటోనీ వర్గీస్, ప్రముఖ తమిళ దర్శక-నటుడు మిస్కిన్ హాజరయ్యారు. మిస్కిన్ ఈ సినిమాతో మలయాళంలో అడుగు పెడుతున్నాడు. దుల్కర్ సల్మాన్ ఈ వేడుకకు హాజరుకాలేకపోయినా, తన సోషల్ మీడియా వేదికగా చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపాడు.

"ఐయామ్ గేమ్" చిత్రంతో దుల్కర్ మాలీవుడ్ లోకి రెండేళ్ల విరామం తర్వాత రీ ఎంట్రీ ఇస్తున్నాడు. అతడి గత చిత్రం "కింగ్ ఆఫ్ కొత్త" పెద్ద అంచనాల మధ్య విడుదలైనా, బాక్సాఫీసు వద్ద ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోలేకపోయింది.

ఈ చిత్రం ఒక వేగవంతమైన క్రీడా థ్రిల్లర్‌గా తెరకెక్కుతోంది. ఈ కథను సజీర్ బాబా, బిలాల్ మొయిదు, ఇస్మాయిల్ అబూబక్కర్ లు సంయుక్తంగా రచించగా, సంభాషణలు ఆదర్శ్ సుకుమారన్, షబాస్ రషీద్లు అందించారు. వీరే ఆర్‌డిఎక్స్ కు స్క్రీన్‌ప్లే అందించిన రచయితలు.

ఈ చిత్రాన్ని దుల్కర్ సల్మాన్ తన స్వంత సంస్థ వేఫారర్ ఫిలిమ్స్ ద్వారా జోమ్ వర్గీస్ తో కలిసి నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని మలయాళం, తమిళం, తెలుగు, హిందీ, కన్నడ భాషల్లో విడుదల చేయాలని భావిస్తున్నారు, దీని ద్వారా ఇది దేశవ్యాప్తంగా విస్తృత ప్రేక్షకులను ఆకట్టుకునే అవకాశం ఉంది.

Tags

Next Story